పరీక్షల్లో వర్మ ఏం చేసేవాడంటే ..!: తల్లి సూర్యవతి చెప్పిన ఆసక్తికర విషయాలు
- రామ్ గోపాల్ వర్మ గురించి ప్రస్తావించిన తల్లి
- స్కూల్ కి వెళ్లనని మారాం చేసేవాడని వెల్లడి
- ఆన్సర్లు తెలిసినా రాసేవాడు కాదని వివరణ
- చిన్నప్పటి నుంచి అంతే అంటూ వ్యాఖ్య
రామ్ గోపాల్ వర్మ తన మనసుకు తోచిన మాట అనేస్తూ ఉంటారు. 'నా ఇష్టానికి నేను సినిమాలు తీస్తుంటాను .. మీకు ఇష్టమైతేనే చూడండి' అనే డైరెక్టర్ గా వర్మ తప్ప మరెవరూ కనిపించరేమో. అలాంటి ఆయన బాల్యం గురించి తెలుసుకోవాలని చాలామంది అభిమానులకు ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో వర్మతో పాటు ఆయన తల్లి సూర్యవతి కూడా పాల్గొన్నారు.
సూర్యవతి మాట్లాడుతూ .. "వర్మ ఇప్పుడు ఎలా ఉన్నాడో .. చిన్నప్పుడు కూడా అలాగే ఉండేవాడు. స్కూల్ కి వెళ్లనని మారాం చేసేవాడు. నేను బాగానే కొట్టేదానిని .. నడిపించుకుంటూ వెళ్లి స్కూల్లో దిగబెట్టి వచ్చేదానిని. స్కూల్ డ్రెస్ వేసిన తరువాత మాత్రం ఇక ఏడ్చేవాడుకాదు. స్కూల్లో టీచర్లు సరిగ్గా చెప్పడం లేదని అనేవాడు" అని చెప్పారు.
"వర్మకి ఒకసారి 100కి 90 మార్కులు వస్తే, మరోసారి 100కి 30 మార్కులే వచ్చేవి. 'నువ్వు చదువుకున్నవి రాలేదేరా' అని అడిగితే, 'అన్నీ నాకు తెలిసిన ఆన్సర్లే .. కాకపోతే రాయాలనిపించలేదు .. రాయలేదు' అనేవాడు. ఎంత కొట్టినా .. తిట్టినా నన్ను మాత్రం ఏమీ అనేవాడు కాదు" అంటూ చెప్పుకొచ్చారు.