పాస్టర్ జన్మదిన వేడుకల్లో.. భావోద్వేగంతో ఏడ్చేసిన ఎమ్మెల్యే రాజయ్య
- తానే తప్పు చేయలేదంటూ భావోద్వేగం
- కూతురు వయసున్న మహిళను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారని ఆరోపణ
- దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలని సవాల్
- ఏదేమైనా మరోసారి భారీ మెజారిటీతో గెలుస్తానని రాజయ్య ధీమా
లైంగిక ఆరోపణల విషయంలో ఇటీవల వార్తల్లోకెక్కిన స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత తాటికొండ రాజయ్య ఓ వేడుకలో భావోద్వేగానికి లోనయ్యారు. కరుణాపురంలో బుధవారం జరిగిన ఓ చర్చి ఫాదర్ పుట్టిన రోజు వేడుకలకు ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసేటప్పుడు ఎమ్మెల్యే భావోద్వేగానికి లోనయ్యారు. కేకు ముందు కూర్చుని వెక్కివెక్కి ఏడ్చేశారు. (వీడియో లింక్) తనపై లైంగిక ఆరోపణలు రావడంతో తీవ్రంగా కలత చెందానని చెప్పారు.
రాజకీయంగా ఎదుర్కోలేక, వచ్చే ఎన్నికల్లో తనకు పోటీగా నిలుచుని గెలవలేమని ఇలాంటి నీచానికి దిగజారారని మండిపడ్డారు. కూతురు వయస్సున్న మహిళను అడ్డుపెట్టుకుని తనపై బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలని తన ప్రత్యర్థులకు రాజయ్య సవాల్ విసిరారు. ప్రత్యర్థుల కుట్రలను ఛేదించి వచ్చే ఎన్నికల్లో ఐదోసారి భారీ మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. స్టేషన్ ఘన్ పూర్ లో తనపై జరుగుతున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. తన ప్రత్యర్థులు చేస్తున్న కుట్రలను, దిగజారుడు రాజకీయాలను గమనించి వచ్చే ఎన్నికల్లో వారికి బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే రాజయ్య నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు.