వైఎస్ వివేకా హత్యకు నాలుగేళ్లు.. జస్టిస్ ఫర్ వివేకా అంటూ చంద్రబాబు ట్వీట్

  • జగనాసుర రక్తచరిత్ర గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని వ్యాఖ్య
  • సొంత బాబాయి హంతకులను శిక్షించడంలోనూ జగన్ విఫలమయ్యాడని విమర్శ
  • ఆడబిడ్డకు న్యాయం చేస్తాడా అని ట్విట్టర్ లో ప్రశ్నించిన టీడీపీ చీఫ్
వైసీపీ నేత, మాజీ ప్రజాప్రతినిధి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురై నేటికి నాలుగేళ్లు పూర్తయ్యాయని, ఆయనకు ఇప్పటికైనా న్యాయం చేయాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జస్టిస్ ఫర్ వివేకా అంటూ బుధవారం ట్వీట్ చేశారు. వైఎస్ వివేకా హత్య జగనాసుర రక్త చరిత్రేనని పులివెందుల పూల అంగళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్ లోని ప్రతీ ఒక్కరికీ తెలుసని చంద్రబాబు పేర్కొన్నారు.

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో జగన్ ఒక్క పనీ చేయలేకపోయాడని విమర్శించారు. చివరకు సొంత బాబాయి హత్యకు గురైతే, హంతకులను చట్టపరంగా శిక్షించడంలోనూ విఫలమయ్యాడని చంద్రబాబు మండిపడ్డారు.

వైఎస్ వివేకా హత్యకు కుట్ర జరిగింది ఆ ఇంట్లోనేనని, ఇది జగనాసుర రక్త చరిత్రేనని చంద్రబాబు విమర్శించారు. తండ్రి శవం పక్కన ఉండగానే ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాలు సేకరించిన వ్యక్తి, బాబాయి హత్యతో రాజకీయ లబ్ది పొందిన వ్యక్తి ఇప్పుడు ఆడబిడ్డకు న్యాయం చేస్తాడా అంటూ వివేకా హత్య పరిణామాలపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు.


More Telugu News