ముఖ్యమంత్రి ఇతర కులాలకు భయపడడు... ఒక్క కాపులకు మాత్రమే భయపడతాడు: పవన్ కల్యాణ్
- మచిలీపట్నంలో జనసేన బహిరంగ సభ
- పార్టీ 10వ ఆవిర్భావ సభలో పాల్గొన్న పవన్
- యువత కులాల ఉచ్చులో పడొద్దని హితవు
- కాపులకు సంఖ్యాబలం ఉందని వెల్లడి
- కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని సూచన
మచిలీపట్నంలో నిర్వహించిన జనసేన 10వ ఆవిర్భావ దినోత్సవ సభలో జనసేనాని పవన్ కల్యాణ్ ప్రసంగించారు. యువత కులాల ఉచ్చులో పడొద్దని హితవు పలికారు. తనకు అన్ని కులాల్లో అభిమానులు ఉన్నారని వెల్లడించారు. తాను కులాన్ని తాకట్టు పెడుతున్నానని వాగే వారు ఇతర కులాల వారితో బంధుత్వాలు పెట్టుకోలేదా? వ్యాపారాలు చేయడం లేదా? అని ప్రశ్నించారు. ఈ ముఖ్యమంత్రి సంఖ్యా బలం లేని మిగతా కులాలకు భయపడడని, కాపులకు సంఖ్యాబలం ఉందని, అన్ని కులాలను కలుపుకుంటూ కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.
వసుధైక కుటుంబం అనేది మన భారత సంస్కృతి అని, ముస్లిం అయిన అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేశామని, షారుఖ్ ఖాన్ ను సూపర్ స్టార్ ను చేశామని, అజారుద్దీన్ ను భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ను చేశామని, ఇది మన దేశ గొప్పదనం అని వివరించారు.
పవన్ ప్రసంగం హైలైట్స్...
వసుధైక కుటుంబం అనేది మన భారత సంస్కృతి అని, ముస్లిం అయిన అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేశామని, షారుఖ్ ఖాన్ ను సూపర్ స్టార్ ను చేశామని, అజారుద్దీన్ ను భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ను చేశామని, ఇది మన దేశ గొప్పదనం అని వివరించారు.
పవన్ ప్రసంగం హైలైట్స్...
- మాట్లాడితే 175 స్థానాల్లో పోటీ చేయండి అంటున్నాడు... నీకెందుకు మేం ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తే?
- వైసీపీ నేతల్లో కొందరు మగతనం గురించి మాట్లాడుతున్నారు. అధికారంలోకి వచ్చాక చూపిస్తాం మా మగతనం ఏంటో!
- గతంలో ధుర్యోధనుడు తొడలు కొడితే, భీమసేనుడు ఆ రెండు తొడలు బద్దలు కొట్టాడు. ఇప్పుడు వైసీపీ నేతలు కూడా అలాగే తొడలు కొడితే జనసేన బద్దలు కొడుతుంది.
- నేను రెడ్డి సామాజిక వర్గానికి వ్యతిరేకం కాదు. కానీ పదవులు అన్నీ ఒక్క రెడ్డి సమాజానికే ఇచ్చేస్తే... యాదవులు తదితర మిగతా కులాల వారు ఏమైపోవాలి? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకు పదవులు అక్కర్లేదా?
- చదువుకున్న వారు కూడా ఓటును అర్ధరూపాయికి అమ్మేస్తే, నాలాగా నిజాయతీగా నిలబడినవాడు ఎలా గెలుస్తాడు?
- గుండెలు బాదుకోవడం కాదు... గుండెల్లో పెట్టుకోండి. గజమాలలు కాదు... బలం పెంచండి. జనసేన పార్టీ బలం ఎంతో రాష్ట్రంలో తిరిగి అంచనా వేస్తాం... సంపూర్ణమైన నమ్మకం కలిగితే మాత్రం జనసేన ఒంటరిగా వెళ్లేందుకు సిద్ధం.
- పవర్ స్టార్ అని, సీఎం అని నినాదాలు కాదు... జనసేనకు మద్దతు ఇవ్వాలి. రాష్ట్రంలో రీసెర్చ్ చేసి డేటాను పరిశీలించాల్సి ఉంది.