‘గీత సాక్షిగా’ పెద్ద హిట్ కావాలి: ‘నాంది’ డైరెక్టర్ విజయ్ కనకమేడల
- వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన 'గీతసాక్షిగా'
- మహిళలపై జరిగే దురాగతాలు చుట్టూ తిరిగే కథ
- కథానాయికగా కనిపించనున్న చిత్ర శుక్ల
- ఈ నెల 22వ తేదీన సినిమా రిలీజ్
యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఇన్‌టెన్స్ ఎమోషనల్ డ్రామా ‘గీత సాక్షిగా’. ఆదర్శ్, చిత్రా శుక్లా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని మార్చి 22న తెలుగు .. తమిళ భాషల్లో విడుదల చేస్తున్నారు. ప్రమోషన్స్ ఫుల్ స్వింగులో ఉన్నాయి. మంగళవారం ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. 'నాంది' సినిమా దర్శకుడు విజయ్ కనకమేడల, నిర్మాత సతీష్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
హీరో ఆదర్శ్ మాట్లాడుతూ ‘‘నాంది సినిమాతో సూపర్ హిట్ సాధించిన డైరెక్టర్ విజయ్‌గారు మాకు సపోర్ట్ చేయటానికి ఇక్కడకు వచ్చినందుకు ఆయనకు థాంక్స్. వండర్‌ఫుల్ అవకాశాన్ని నాకు ఇచ్చిన మా నిర్మాత చేతన్‌గారికి థాంక్స్. ఈ సక్సెస్‌తో ఆయన తెలుగులో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్ ఆంథోనిగారి డెడికేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ మధ్య కాలంలో తెలుగు ప్రేక్షక దేవుళ్లు కంటెంట్ ఉన్న సినిమాలనే ఆదరిస్తున్నారు. అలాంటి వారందరికీ మా 'గీతసాక్షిగా' తప్పకుండా నచ్చుతుంది. ఈ సినిమాను ఈ నెల 22న థియేటర్స్‌లోనే చూడండి" అని చెప్పారు.
చిత్ర నిర్మాత చేతన్ రాజ్ మాట్లాడుతూ ‘‘నేను ముంబైలో డిస్ట్రిబ్యూటర్‌ని. హైదరాబాద్‌కి వచ్చి పోతుంటాను. సాధారణంగా మన దేశంలో మహిళలను అమ్మగా పూజస్తాం. మహిళ అంటే శక్తి స్వరూపిణి. మనకు ఆ శక్తి సపోర్ట్ చేస్తుంటుంది. అలాంటి వారిపై దురాగతాలు జరుగుతున్నాయి. దానిపై సినిమా చేయాలని అనుకుంటున్న సమయంలో ఆదర్శ్ ద్వారా ఆంథోని టీమ్ పరిచయమైంది. ఆంథోని సినిమాను చక్కగా తెరకెక్కించాడు" అన్నారు.
దర్శకుడు ఆంథోని మట్టిపల్లి మాట్లాడుతూ ‘‘సాధారణంగా పేపర్స్‌ల్లో అమ్మాయిలపై అత్యాచారాలు జరిగాయనే వార్తలు చదివినప్పుడు ఎంతో బాధగా అనిపిస్తుంది. అలాంటివి జరిగినప్పుడు పోలీస్ డిపార్ట్‌మెంట్, కోర్టులు ఎలా రియాక్ట్ అవుతున్నాయనే దాన్ని రీసెర్చ్ చేశాను. నేను చదివిన చాలా ఘటనల్లో నుంచి ఓ పాయింట్ తీసుకుని 'గీతసాక్షిగా' సినిమా చేశాను. కొత్త డైరెక్టర్‌ని అయినప్పటికీ అందరూ ఎంతగానో సపోర్ట్ చేశారు. రెగ్యులర్ మూవీ కాదు.. కాన్సెప్ట్ బేస్డ్ మూవీ" అన్నారు.
'నాంది' డైరెక్టర్ విజయ్ కనకమేడల మాట్లాడుతూ ‘‘నేను ఆరు నెలల ముందు సినిమాటోగ్రఫర్ విజయ్‌గారి వల్ల 'గీతసాక్షిగా' విజువల్స్ చూశాను. బాగున్నాయనిపించింది. ఆదర్శ్ నాకు 'ఢీ' షో నుంచి తెలుసు. అక్కడ నుంచి తను టీవీ సీరియల్స్‌లోనూ నటించారు. ఇప్పుడు హీరోగా 'గీతసాక్షిగా'తో పరిచయం అవుతున్నాను. చిత్ర శుక్ల రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా మంచి పాత్రలను ఎంచుకుని సినిమాలు చేస్తోంది. డైరెక్టర్ ఆంథోని కెరీర్‌లో 'గీత సాక్షిగా' మంచి సినిమా కావాలని కోరుకుంటున్నాను" అన్ని చెప్పారు.