మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన హర్మన్ ప్రీత్ కౌర్
- డబ్ల్యూపీఎల్ లో ముంబయి ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్
- టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబయి
- 20 ఓవర్లలో 8 వికెట్లకు 162 పరుగులు
- 30 బంతుల్లో 51 పరుగులు చేసిన హర్మన్ ప్రీత్
- రాణించిన యస్తికా భాటియా, నాట్ షివర్
- ఆష్లే గార్డనర్ కు 3 వికెట్లు
డబ్ల్యూపీఎల్ లో నేడు ముంబయి ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన గుజరాత్ జెయింట్స్... ముంబయి ఇండియన్స్ కు బ్యాటింగ్ అప్పగించింది. నిర్ణీత 20 ఓవర్లలో ముంబయి జట్టు 8 వికెట్లకు 162 పరుగులు చేసింది.
కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మరోసారి బాధ్యతాయుతంగా ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించింది. హర్మన్ ప్రీత్ 30 బంతులాడి 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 51 పరుగులు చేసింది. ఓపెనర్ యస్తికా భాటియా 44, నాట్ షివర్ 36 పరుగులు చేశారు. ఓపెనర్ హేలీ మాథ్యూస్ డకౌట్ అయింది.
గుజరాత్ జెయింట్స్ బౌలర్లలో ఆష్లే గార్డనర్ 3, కిమ్ గార్త్ 1, కెప్టెన్ స్నేహ్ రాణా 1, తనూజా ఠాకూర్ 1 వికెట్ తీశారు.
163 పరుగుల లక్ష్యఛేదనలో జెయింట్స్ జట్టు 8 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 46 పరుగులు చేసింది. హర్లీన్ డియోల్ 21, ఆష్లే గార్డనర్ 7 పరుగులతో ఆడుతున్నారు.