జోరందుకున్న అంజలి పెళ్లి గురించిన రూమర్!

  • తెలుగమ్మాయిగా అంజలికి గుర్తింపు 
  • శంకర్ సినిమాలో దక్కిన ముఖ్యమైన పాత్ర 
  • వెబ్ సిరీస్ లతోను బిజీగా ఉన్న అంజలి 
  • త్వరలోనే ఆమె పెళ్లి జరగనున్నట్టుగా వస్తున్న వార్తలు 
అంజలి కథనాయికగా వెండితెరకి పరిచయమై 17 ఏళ్లు అవుతోంది. అప్పటివరకూ తెలుగు హీరోయిన్స్ కి అంతగా అవకాశాలు వచ్చేవి కాదు. కానీ ఈ 'రాజోలు' బ్యూటీ ముందుగా కోలీవుడ్ లో తన సత్తా చాటుకుని ఆ తరువాత తెలుగులో బిజీ అయింది. గలగలమని మాట్లాడుతూ .. సహజమైన నటనను కనబరిచే అంజలికి అభిమానుల సంఖ్య ఎక్కువే. 

అంజలి అదృష్టం కొద్దీ సినిమాల్లో వేషాలు తగ్గుతున్న సమయంలోనే, వెబ్ సిరీస్ లకు ఆదరణ పెరిగింది. దాంతో అంజలి ఆ వైపు కాస్త గట్టిగానే దృష్టిపెట్టింది. ఆమె చేసిన 'ఝాన్సీ' .. 'ఫాల్' వెబ్ సిరీస్ లకు మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం ఆమె శంకర్ - చరణ్ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తోంది. ఈ సినిమా తరువాత అంజలి పెళ్లి చేసుకోబోతోందనే ఒక టాక్ బలంగా వినిపిస్తోంది. 

అంజలికి తన కుటుంబ సభ్యులతో గతంలో ఉన్న మనస్పర్థలు తొలగిపోయాయట. ఇప్పుడు వాళ్లు ఆమెకి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఆ దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయని అంటున్నారు. మరి ఈ రూమర్ ఇంతటితో ఆగుతుందా? నిజమవుతుందా? అనేది చూడాలి. 



More Telugu News