రాష్ట్రానికి గవర్నర్ పెద్దా? సీఎం పెద్దా?: పయ్యావుల కేశవ్
- గవర్నర్ ప్రసంగంలో మూడు రాజధానుల అంశం లేదన్న కేశవ్
- గవర్నర్ చేత సీఎంను పొగిడించారని మండిపాటు
- అసత్యాలు చదవలేక గవర్నర్ ఇబ్బంది పడ్డారన్న రామానాయుడు
సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న మూడు రాష్ట్రాల అంశంపై వైసీపీ నేతలు బహిరంగంగా మాట్లాడుతుంటారని... ఆ అంశాన్ని గవర్నర్ ప్రసంగంలో ఎందుకు పెట్టించలేదని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగంలో ముఖ్యమంత్రి జగన్ ను పొగిడించారని మండిపడ్డారు. రాష్ట్రానికి గవర్నర్ పెద్దా? లేక సీఎం పెద్దా? అని ప్రశ్నించారు. సీఎంను పొగిడించి గవర్నర్ స్థాయిని తగ్గించారని దుయ్యబట్టారు. స్పీకర్ కార్యాలయంలో గవర్నర్ ను వేచి ఉండేలా చేశారని విమర్శించారు. సభా నిబంధనలకు ఇది పూర్తిగా విరుద్ధమని అన్నారు. సుప్రీంకోర్టులో జడ్జిగా వ్యవహరించిన వ్యక్తితో ఈ ప్రభుత్వం అబద్ధాలను చెప్పించిందని అన్నారు.
నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ... గవర్నర్ ప్రసంగంలో రంగులు, పేర్ల పిచ్చి తప్ప మరేం లేదని విమర్శించారు. వివిధ పథకాలకు సంబంధించి ప్రభుత్వం చెప్పించిన లెక్కలన్నీ తప్పేనని అన్నారు. గవర్నర్ ప్రసంగంలో పోలవరం, అమరావతి ప్రస్తావనే లేదని మండిపడ్డారు. అసత్యాలను చదవలేక గవర్నర్ ఇబ్బంది పడ్డారని చెప్పారు.