అసెంబ్లీ లాబీలో పేర్ని నాని, పయ్యావుల కేశవ్ మధ్య ఆసక్తికర సంభాషణ
- ఆప్యాయంగా పలకరించుకున్న పేర్ని నాని, పయ్యావుల
- వచ్చే ఎన్నికల్లో మీరు మళ్లీ గెలవాలన్న పేర్ని నాని
- 1994 నాటి ఎన్నికల ఫలితాలు వస్తాయన్న పయ్యావుల
ఏపీ అసెంబ్లీ లాబీలో ఈరోజు ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని ఇద్దరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. వచ్చే ఎన్నికల్లో మీరు మళ్లీ గెలవాలనుకుంటున్నానని పేర్ని నాని అన్నారు. ఉరవకొండలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి రాదనే సెంటిమెంట్ ఉంది. దీన్ని గుర్తు చేస్తూ పేర్ని నాని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కేశవ్ స్పందిస్తూ... 1994లో వచ్చిన ఫలితాలే 2024లో వస్తాయని చెప్పారు. 1994లో ఉరవకొండలో టీడీపీ గెలిచిందని... టీడీపీ అధికారాన్ని చేపట్టిందని గుర్తు చేశారు.