ఇస్మార్ట్ ఏనుగు.. ఐఎఫ్ఎస్ అధికారి షేర్ చేసిన వీడియో వైరల్
- పైపుతో స్నానం చేస్తున్న ఏనుగు
- మనుషుల సాయం లేకుండానే జలకాలాట
- ట్విట్టర్‌లో వీడియో వైరల్
ఇతర జంతువులతో పోలిస్తే ఏనుగులు చాలా తెలివైనవి! పరిస్థితులకు తగినట్టుగా అవి తమని తాము మార్చుకోగలవు. అలాంటి ఓ ఏనుగు వీడియో చూసి నెటిజన్లు నోరెళ్ల బెడుతున్నారు. ఇంతకీ ఆ ఏనుగు ఏం చేసిందంటే.. ఎండవేళ చక్కగా పైపుతో స్నానం చేస్తూ సేద తీరింది. మనుషుల లాగా ఒడుపుగా పైపును తొండంతో పట్టుకుని జలకాలాడింది. అంతేనా.. వీపు దాకా పైపు వెళ్లకపోయే సరికి కొంత నీటిని తొండంతో ఒంటిపై జల్లుకుంది. మనిషి సాయం లేకుండానే తనంత తానుగా హ్యాపీగా స్నానం చేస్తున్న గజరాజును చూసి జనాలు తెగ ఆశ్చర్యపోతున్నారు.
ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అడవిలో స్వేచ్ఛగా ఉండాల్సిన గజరాజును ఇలా నాలుగు గోడల మధ్య బందీ చేయడం తగదన్న ఆయన.. ఏనుగు తెలివితేటల్ని మాత్రం మెచ్చుకుని తీరాల్సిందేనని చెప్పారు. ఇన గజరాజును చూసి ముచ్చటపడుతున్న నెటిజన్లు వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. ఆత్మనిర్భరత అంటే ఇదే అంటూ కొందరు కొంటె జోకులు కూడా వేస్తున్నారు.