రిటైర్మెంట్‌కు వేళాయె.. ఆసియా క్రీడల తర్వాత మేరీకోమ్ గుడ్‌బై!

  • ఆరుసార్లు ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న మేరీకోమ్
  • బాక్సింగ్ నిబంధనల ప్రకారం 40 ఏళ్లు దాటితే పోటీలకు నో చాన్స్
  • రిటైర్మెంట్‌కు ముందు ఒక్కసారైనా ఆడడమే తన కల అన్న మేరీ కోమ్
భారత బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ రిటైర్మెంట్ యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆరుసార్లు ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ అయిన మేరీ కోమ్ వయసు ఈ ఏడాది నవంబరులో 41 ఏళ్లకు చేరుకుంటుంది. బాక్సింగ్ నిబంధనల ప్రకారం 40 ఏళ్లు దాటిన బాక్సర్లు పోటీలో పాల్గొనే అవకాశం లేదు. ఈ నేపథ్యంలోనే మేరీ కోమ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 

ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టు జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మేరీ మాట్లాడుతూ.. తనకింకా ఒక్క ఏడాది మాత్రమే సమయం ఉందని, ఈలోపు ఒక్కసారైనా క్రీడల్లో పాల్గొనాలనేది తన కల అని పేర్కొంది. ఆసియా క్రీడలకు అర్హత సాధించకుంటే కనుక చివరిగా మరేదైనా అంతర్జాతీయ టోర్నీలో పాల్గొని వీడ్కోలు చెప్పాలనుకుంటున్నట్టు తెలిపింది.


More Telugu News