బ్యాక్ స్టేజ్ పార్టీలో ఆస్కార్ అవార్డును సగర్వంగా ప్రదర్శించిన ఆర్ఆర్ఆర్ టీమ్
- అమెరికాలో ముగిసిన ఆస్కార్ అవార్డుల పండుగ
- నాటు నాటు పాటకు ఆస్కార్ పురస్కారం
- బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నెంబర్ వన్ గా తెలుగు పాట
- ఆఫ్టర్ పార్టీలో ఉత్సాహంగా పాల్గొన్న ఆర్ఆర్ఆర్ టీమ్
యావత్ భారతదేశం గర్వించేలా ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాట ఆస్కార్ పురస్కారం గెలుచుకోవడం తెలిసిందే. తెలుగుదనం ఉట్టిపడే ఆ పాటకు అత్యున్నత అవార్డు దక్కడంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సందడి వాతావరణం నెలకొంది.
ఇక, ఆర్ఆర్ఆర్ టీమ్ ఆనందం అంతాఇంతా కాదు. ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అనంతరం నిర్వహించిన బ్యాక్ స్టేజ్ పార్టీలో దర్శకుడు రాజమౌళి, హీరో రామ్ చరణ్, సంగీత దర్శకుడు కీరవాణి, గీత రచయిత చంద్రబోస్, నిర్మాత శోభు యార్లగడ్డ పట్టరాని ఉత్సాహంతో కనిపించారు. తమకు లభించిన ఆస్కార్ ను సగర్వంగా ప్రదర్శించారు. ఆస్కార్ ప్రతిమను రామ్ చరణ్ గర్వంగా ముద్దాడారు.
గత కొన్నిరోజులుగా అమెరికాలోనే ఉన్న రాజమౌళి బృందం... నాటు నాటు పాటకు ఆస్కార్ ఖాయమని గట్టిగా చెబుతూ వస్తోంది. దాంతో అభిమానులు ఆస్కార్ ఫంక్షన్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూశారు.
నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డు లభించిందన్న ప్రకటనతో ఆనందం పొంగిపొర్లింది. ఉదయం నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్, నాటు నాటు పాట, ఆస్కార్ అవార్డు... ఇదే చర్చ జరుగుతోంది.