ఎమ్మెల్సీ ఎన్నికల వేళ స్థానికేతరుడైన వైవీ సుబ్బారెడ్డికి విశాఖలో ఏం పని?: చంద్రబాబు
- ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు
- వైవీ సుబ్బారెడ్డి విశాఖలో పర్యటించడంపై టీడీపీ అభ్యంతరం
- సీఈసీకి ఫిర్యాదు చేసిన చంద్రబాబు
- వైవీ సుబ్బారెడ్డి నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపణ
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో, వైసీపీ అగ్రనేత వైవీ సుబ్బారెడ్డి విశాఖలో పర్యటించారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కు ఫిర్యాదు చేశారు. విశాఖలో వైవీ సుబ్బారెడ్డి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సమయంలో స్థానికేతరుడైన వైవీ సుబ్బారెడ్డికి విశాఖలో ఏం పని? అని చంద్రబాబు ప్రశ్నించారు. స్థానికేతరుడైన సుబ్బారెడ్డి ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు.
విశాఖలో పోలింగ్ కేంద్రాల వద్ద పర్యటించిన సుబ్బారెడ్డిపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సీఈసీని కోరారు. పోలింగ్ ముగిసే వరకు బూత్ ల వద్ద బయటి వ్యక్తులు ఉండకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.