పవన్ కు పొలిటికల్ ఆస్కార్ ఇవ్వాలి: పేర్ని నాని
- నిన్న బీసీలు, కాపులతో సమావేశమైన పవన్ కల్యాణ్
- పవన్ ఎప్పుడేం మాట్లాడతాడో తెలియదన్న పేర్ని నాని
- నెలలో రెండ్రోజులు ఏపీకి వస్తాడని వ్యాఖ్యలు
- పవన్ కు కులాలపై కనీస అవగాహన లేదని విమర్శలు
జనసేనాని పవన్ కల్యాణ్ నిన్న మంగళగిరి పార్టీ కార్యాలయంలో బీసీ రౌండ్ టేబుల్ సమావేశం, ఆ తర్వాత కాపు సంక్షేమ సేనతో భేటీ సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు.
పవన్ ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదని విమర్శించారు. పవన్ సిద్ధాంతాలు, లక్ష్యం లేని వ్యక్తి అని పేర్కొన్నారు. నెలలో రెండు రోజులు మాత్రమే ఏపీకి వచ్చే పవన్, ఏవేవో మాట్లాడి విమానమెక్కి హైదరాబాద్ వెళ్లిపోతాడని ఎద్దేవా చేశారు. పవన్ ఉపన్యాసాలన్నీ సినిమా డైలాగులేనని వ్యంగ్యం ప్రదర్శించారు.
కాపుల కోసం పవన్ ఏం చేశాడో చెప్పాలని పేర్ని నాని నిలదీశారు. అసలు, ఏ సిద్ధాంతాన్ని చూసి పవన్ కు ఓటేయాలని ప్రశ్నించారు. పవన్ కు కులాలపై కనీస అవగాహన లేదని, రాజకీయాల్లో ఆస్కార్ అవార్డు ఉంటే ప్రతి ఏటా పవన్ కల్యాణ్ కే ఇవ్వాలని సెటైర్ వేశారు.
లోపాయికారీ ఒప్పందాలకు తాను దూరం అని చెబుతున్న పవన్ ఓసారి గత చరిత్రను పరిశీలించాలని పేర్ని నాని సూచించారు. 2012 నుంచి పవన్ ఎవరెవరితో ఒప్పందాలు చేసుకున్నారు? 2014లో చంద్రబాబుకు ఊడిగిం చేసింది ఎవరు? 2019 ఎన్నికల ముందు బీజేపీని తిట్టి, ఎన్నికల తర్వాత బీజేపీని కలిసింది ఎవరు? అంటూ పేర్ని నాని నిలదీశారు.
మరో సంవత్సర కాలంలో పవన్ లో ఉన్న అన్ని రంగులు బయటపడతాయని అన్నారు. పవన్ మాటలను ప్రజలు ఇంకెంతమాత్రం నమ్మబోరని స్పష్టం చేశారు.