అమెరికాలో మరో బ్యాంక్ పతనం నేపథ్యంలో.. కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్లు

  • అమెరికాలో మూతపడ్డ రెండో బ్యాంక్
  • 897 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
  • 258 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలను మూటకట్టుకున్నాయి. వరుసగా మూడోరోజు నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లోకి వెళ్లిన మార్కెట్లు కాసేపటికే నష్టాల బాట పట్టాయి. చివరి వరకు సూచీలు మళ్లీ కోలుకోలేదు. 

ఇటీవలే అమెరికాలోని సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పతనంతో షేక్ అయిన మార్కెట్లు... తాజాగా మరో ప్రముఖ బ్యాంక్ అయిన సిగ్నేచర్ బ్యాంక్ మూతపడటంతో ఈరోజు డీలా పడ్డాయి. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 897 పాయింట్లు కోల్పోయి 58,237కి దిగజారింది. నిఫ్టీ 258 పాయింట్లు నష్టపోయి 17,154కు పడిపోయింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ లో కేవలం టెక్ మహీంద్రా (6.83%) మాత్రం లాభపడింది. ఇండస్ ఇండ్ బ్యాంక్ (-7.46%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-3.21%), టాటా మోటార్స్ (-3.06%), మహీంద్రా అండ్ మహీంద్రా (-2.57%), బజాజ్ ఫిన్ సర్వ్ (-2.47%) టాప్ లూజర్లుగా ఉన్నాయి.



More Telugu News