భర్త పెట్టే కష్టాలను కొడుకు కోసం భరించాను: సింగర్ కౌసల్య
- సింగర్ గా కౌసల్యకి మంచి క్రేజ్
- చక్రి సంగీతంలో ఎక్కువ పాటలు పాడిన గాయని
- వైవాహిక జీవితంలో ఇబ్బందులు
- తన కొడుకే తన సర్వస్వమని చెప్పిన కౌసల్య
చిత్ర తరువాత తెలుగు ప్రేక్షకులకు వినిపించిన కొత్త స్వరాలలో కౌసల్య స్వరం ఒకటి. చక్రి దర్శకత్వంలో ఆమె ఎక్కువ పాటలు పాడారు. ఆమె పాడిన పాటల్లో మనసు పట్టుకుని ఉండిపోయేవి చాలానే ఉన్నాయి. అలా తన స్వరంతో అనుభూతి పరిమళాలు వెదజల్లిన కౌసల్య, వైవాహిక జీవితంలో మాత్రం చాలా ఇబ్బందులనే చూశారు. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.
"నా వైవాహిక జీవితంలో నేను చాలా ఇబ్బందులు పడ్డాను. అప్పట్లో మా బాబు చాలా చిన్న పిల్లవాడు. తనకి తండ్రి ప్రేమ చాలా అవసరం .. అందువలన నేను ఓపికగా కష్టాలను భరించాను. మా వారు మరో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకునే వరకూ నేను సర్దుకుపోవడానికే ప్రయత్నిస్తూ వచ్చాను. కానీ కుదరలేదు .. నా వంతు ప్రయత్నం నేను చేశాను గనుక, ఇప్పుడు ఇక నాకు ఎలాంటి బాధలేదు. మా అబ్బాయి మళ్లీ పెళ్లి చేసుకోమని అంటున్నాడు. ఎవరి కోసమో జీవితాన్ని ఎందుకు త్యాగం చేయాలని అడుగుతున్నాడు" అన్నారు.
"మా ఫాదర్ నా చిన్నప్పుడే పోయారు. అమ్మ నన్ను పెంచి పెద్ద చేసింది. ఎనిమిదేళ్ల క్రితం ఆమె చనిపోయారు. ఇప్పుడు నా లోకం .. నా సర్వస్వము నా బాబునే. నా పాటకి మంచి గుర్తింపు వస్తే, ముందుగా సంతోషపడేది మా అబ్బాయినే. మా అబ్బాయిని డైనమిక్ గా పెంచాను. అందువలన తనకి ఎదురైన సమస్యలను తాను ధైర్యంగా పరిష్కరించుకోగలడు" అని చెప్పుకొచ్చారు.