హుబ్బళ్లి లో ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే ప్లాట్ ఫామ్

  • కిలోమీటరున్నర పొడవునా రైల్వే ప్లాట్ ఫామ్
  • శ్రీ సిద్ధరూద స్వామీజీ హుబ్బళ్లి స్టేషన్ లో నిర్మాణం
  • గిన్నిస్ రికార్డుల పుస్తకంలో చోటు
కర్ణాటక రాష్ట్రంలోని హుబ్బళ్లి (హుబ్లీ) రైల్వే స్టేషన్ ప్రత్యేక గుర్తింపునకు నోచుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే ప్లాట్ ఫామ్ ఇక్కడ ఏర్పాటైంది. శ్రీసిద్ధరూద స్వామీజీ హుబ్బళ్లిలోని రైల్వే ప్లాట్ ఫామ్ ను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఇటీవలే గుర్తించింది. ఇక్కడ 1,507 మీటర్ల పొడవైన ప్లాట్ ఫామ్ ను రూ.20 కోట్ల వ్యయంతో నిర్మించారు. 1.5 కిలోమీటర్ల పొడవు అంటే మామూలు విషయం కాదు కదా.

హుబ్బళ్లి యార్డ్ నవీకరణలో భాగంగా దీన్ని ఏర్పాటు చేశారు. కర్ణాటకలో శ్రీసిద్ధరూద స్వామీజీ రైల్వే స్టేషన్ కీలకమైన జంక్షన్. వాణిజ్య కార్యకలాపాలకు ఇది కీలక హబ్ గా పని చేయనుంది. ప్రధాని నరేంద్ర మోదీ దీన్ని ఆదివారం ప్రారంభించారు.  


More Telugu News