ఆస్కార్ వేడుకల్లో భుజంపై పులి బొమ్మ గురించి ఎన్టీఆర్​ చెప్పిన మాటలకు అంతా ఫిదా!

  • ఆస్కార్ వేడుకల్లో తళుక్కుమన్న ఆర్ఆర్ఆర్ యూనిట్
  • డిజైనర్ దుస్తుల్లో రెడ్ కార్పెట్ పై నడిచిన తారక్, ఎన్టీఆర్
  • తారక్ సూట్ పై ఆకట్టుకున్న పులి బొమ్మ
ఆస్కార్ వేడుకల్లో తెలుగు చిత్ర పరిశ్రమ తళుక్కున మెరిసింది. ఊహించినట్టే ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటునాటు పాటకు ఆస్కార్ అవార్డు దక్కింది. లాస్ ఏంజెల్స్ లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవానికి ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం హాజరైంది. ఎన్టీఆర్, చరణ్, రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్ అందరూ ప్రత్యేకంగా డిజైన్ చేసిన సంప్రదాయ దుస్తులు ధరించి రెడ్ కార్పెట్ పై నడిచారు. చరణ్, ఎన్టీఆర్ బ్లాక్ కలర్ షెర్వానీ సూట్ లో మెరిపోయారు. 

ఇక ఎన్టీఆర్ సూట్ పై గర్జిస్తున్న పులిబొమ్మ అందరినీ ఆకట్టుకుంది. భుజంపై ఉన్న ఆ పులి బొమ్మ గురించి ఆస్కార్ నిర్వాహకులు ఆరా తీశారు. ఈ పులి బొమ్మ ఏమిటని ఓ యాంకర్ అడగ్గా ఎన్టీఆర్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ‘ఆర్ఆర్ఆర్‌లో చూశారు కదా. నాతో పాటు పులి కనిపించింది. నిజానికి, పులి మా దేశ జాతీయ జంతువు. మా దేశ చిహ్నంతో రెడ్ కార్పెట్‌పై నడవడం గర్వంగా ఉంది’ అని చెప్పారు. ఎన్టీఆర్ సమాధానానికి ఫిదా అయిన యాంకర్ మిమ్మల్ని చూస్తే దక్షిణ ఆసియా మొత్తం గర్వపడుతుందని తెలిపారు.


More Telugu News