ఆస్కార్ అవార్డుపై పవన్ కల్యాణ్, రామ్ గోపాల్ వర్మ స్పందన
- వార్త వినగానే చాలా సంతోషించానన్న పవన్
- భారతీయులంతా గర్వపడేలా చేశారని కితాబు
- కిల్లర్ టీమ్ కు కంగ్రాట్స్ అన్న ఆర్జీవీ
'నాటునాటు' పాటకు ఆస్కార్ అవార్డు రావడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. భారతీయులు గర్విస్తున్న క్షణాలివని అన్నారు. భారతీయులంతా గర్వపడేలా ఆస్కార్ వేదికపై పురస్కారాన్ని స్వీకరించిన సంగీత దర్శకుడు కీరవాణికి, గీత రచయిత చంద్రబోస్ కు అభినందనలను తెలియజేస్తున్నానని చెప్పారు. ఆస్కార్ వచ్చిందనే వార్తను చూడగానే ఎంతో సంతోషించానని అన్నారు.
ఈ పాటలోని తెలుగు పదం నేల నలుచెరుగులా ప్రతి ఒక్కరితో పదం కలిపేలా చేసి, హుషారెత్తించిందని చెప్పారు. ఆ హుషారు ఈరోజు ఆస్కార్ వేదికపై రెట్టించిన ఉత్సాహంతో కనిపించిందని అన్నారు. ఆస్కార్ అవార్డు పొందడం ద్వారా భారతీయ సినిమా ఖ్యాతి మరో స్థాయికి చేరిందని చెప్పారు. ఇంతటి ఘనత పొందేలా సినిమాను రూపొందించిన దర్శకుడు రాజమౌళికి పత్యేక అభినందనలు తెలిపారు. కథానాయకుల పాత్రల్లో ఒదిగిపోయిన జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, నిర్మాత డీవీవీ దానయ్యలను అభినందిస్తున్నానని చెప్పారు.
మరోవైపు ఆస్కార్ సాధించిన కీరవాణికి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అభినందనలు తెలిపారు. 'ఆర్ఆర్ఆర్' కిల్లర్ టీమ్ కు కంగ్రాట్స్ అని ట్వీట్ చేశారు.