‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఆర్ట్ ఫిల్మ్ కాదు.. ‘నాటునాటు’ పాట ఆర్ట్ సాంగ్ కాదు.. కానీ..: రామ్‌చరణ్

  • ‘ది హాలీవుడ్ రిపోర్టర్’కు చెర్రీ ఇంటర్వ్యూ
  • ‘ఆర్ఆర్ఆర్’కు ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభించిందన్న రామ్ చరణ్
  • ‘నాటునాటు’ ప్రజల పాటన్న చెర్రీ
  • ప్రజలు దానిని ఓన్ చేసుకున్నారని ఆనందం
ఆస్కార్ వేదికపై తెలుగు సినిమా మెరిసింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటునాటు’ పాట అవార్డు గెలుచుకుంది. సంగీత దర్శకుడు కీరణవాణి, పాటల రచయిత చంద్రబోస్ అవార్డు అందుకున్నారు. అంతకుముందు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ‘ది హాలీవుడ్ రిపోర్టర్’తో మాట్లాడుతూ.. తమకు, ఆర్ఆర్ఆర్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మద్దతు తెలిపిన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు చెప్పాడు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా లభిస్తున్న మద్దతుపై రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు చెర్రీ ఇలా సమాధానం ఇచ్చాడు.

దేశంలోని కోట్లాది మంది ప్రజల మద్దతు తమకు లభించినందుకు ఆనందంగా ఉందన్నాడు. అకాడమీ అవార్డ్స్ ఈ పాటను గుర్తించినందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. ఈ జర్నీ ఎలా అనిపించిందన్న ప్రశ్నకు రామ్ చరణ్ బదులిస్తూ.. ఇది తమకు చాలా ప్రత్యేకమన్నాడు. షూటింగ్ సమయంలో తాము ఆస్కార్ గురించి ఆలోచించలేదన్నాడు. ఇది ఆర్ట్ ఫిల్మ్ కానీ, ఆర్ట్ సాంగ్ కానీ కాదన్నాడు. కానీ అది ప్రజల పాట అయిందన్నాడు. ఈ పాటను ప్రజలు తమ సొంతం చేసుకున్నారన్నాడు.


More Telugu News