సినిమాల్లో బఫూన్ గా నటిస్తే డబ్బులైనా వస్తాయి: రఘురామపై మార్గాని భరత్ వ్యాఖ్యలు
- రఘురామపై ధ్వజమెత్తిన వైసీపీ ఎంపీ
- రఘురామ ఓ అరిటాకు అంటూ వ్యాఖ్యలు
- గూగుల్ లో అరిటాకు అని కొడితే రఘురామ గురించే వస్తుందని వ్యంగ్యం
వైసీపీ ఎంపీ మార్గాని భరత్ రామ్ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నేను లోకేశ్ ను ఏదో అన్నానని రఘురామ చెబుతున్నాడని... లోకేశ్ ఓ కమెడియన్ అని ఇప్పుడు కూడా అంటానని, సీఎం జగనే రియల్ హీరో అని చెబుతానని భరత్ రామ్ స్పష్టం చేశారు. రఘురామ ఢిల్లీ దాటి బయటికి రాలేడని, మీడియా వాళ్లను కూర్చోబెట్టుకుని ఏదేదో వాగుతుంటాడని విమర్శించారు.
నియోజకవర్గం సరే... ఏపీలోనూ, కనీసం హైదరాబాదులోనూ అడుగుపెట్టలేని అజ్ఞాతవాసి అని అభివర్ణించారు. గూగుల్ సెర్చ్ లో అరిటాకు అని వెదికితే రఘురామ గురించే వస్తుందని, ఆయనొక కమెడియన్ అని ఎద్దేవా చేశారు.
రఘురామ ఏవైనా సినిమాల్లో నటిస్తే కనీసం డబ్బులు అయినా వస్తాయని హితవు పలికారు. రఘురామకు పెద్దగా మేకప్ కూడా వేయాల్సిన అవసరం లేదని, మామూలుగానే బఫూన్ లాగా ఉంటాడని వ్యంగ్యం ప్రదర్శించారు. మహాభారతంలో శిఖండికి, ఆయనకు పెద్ద తేడా లేదని అన్నారు.