ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరును దాటేసిన భారత్

  • అహ్మదాబాద్ టెస్టులో భారత్ సూపర్ బ్యాటింగ్
  • ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరు 480 రన్స్
  • 500 మార్కు అధిగమించిన భారత్
  • భారీ ఆధిక్యంపై కన్నేసిన భారత్
అహ్మదాబాద్ టెస్టులో టీమిండియా మెరుగైన బ్యాటింగ్ ప్రదర్శన చేస్తోంది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరు (480)ను భారత్ దాటేసింది. ప్రస్తుతం టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరు 5 వికెట్లకు 508 పరుగులు. ఆసీస్ పై భారత్ 28 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటికే సెంచరీ పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ 160 పరుగులతో క్రీజులో ఉండగా, ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ 49 పరుగులతో ఆడుతున్నాడు. 

ఇవాళ్టి ఆటలో ఆసీస్ సాధించింది కేవలం రెండు వికెట్లేనంటే భారత్ బ్యాటింగ్ ఎలా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. పిచ్ నుంచి పెద్దగా సహకారం లేకపోగా, టీమిండియా బ్యాట్స్ మెన్ కూడా పట్టుదలగా ఆడుతుండడంతో ఆసీస్ బౌలర్లకు నిరాశ తప్పలేదు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లైయన్ 2, టాడ్ మర్ఫీ 2, మాథ్యూ కుహ్నెమన్ 1 వికెట్ తీశారు.


More Telugu News