సాంకేతిక లోపంతో హైదరాబాదులోనే నిలిచిపోయిన అమిత్ షా విమానం
- హైదరాబాదు వచ్చిన అమిత్ షా
- సీఐఎస్ఎఫ్ రైజింగ్ డే వేడుకలకు హాజరు
- హైదరాబాదు నుంచి కొచ్చి వెళాల్సి ఉండగా నిలిచిపోయిన విమానం
- మరో విమానంలో కొచ్చి వెళ్లాలని నిర్ణయం
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ హైదరాబాదులో సీఐఎస్ఎఫ్ 54వ రైజింగ్ డే ఉత్సవాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా, హకీంపేటలో సీఐఎస్ఎఫ్ దళాల గౌరవ వందనం స్వీకరించారు. ఉత్తమ సేవలు అందించిన సీఐఎస్ఎఫ్ అధికారులకు అమిత్ షా రివార్డులు అందజేశారు.
కాగా, అమిత్ షా హైదరాబాదు నుంచి కొచ్చి వెళ్లాల్సి ఉండగా, ఆయన ప్రయాణించాల్సిన విమానం సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. దాంతో ఆయన హకీంపేట విమానాశ్రయంలోనే ఉండిపోయారు.
విమాన మరమ్మతులకు సమయం పట్టడంతో అమిత్ షా... విమానాశ్రయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ లతో సమావేశమయ్యారు. కాగా, అమిత్ షా మరో విమానంలో కొచ్చి వెళతారని తెలుస్తోంది.