నాలుగో వికెట్ కోల్పోయిన భారత్.. కోహ్లీపైనే భారం

  • జడేజాను ఔట్ చేసిన మర్ఫీ
  • నాలుగో వికెట్ కు 64 పరుగుల భాగస్వామ్యానికి తెర
  • ప్రస్తుతం క్రీజులో కోహ్లీకి తోడు కేఎస్ భరత్
అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న నాలుగో టెస్టు లో ఆదివారం, నాలుగో రోజు ఆటలో భారత్ కు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓవర్ నైట్ స్కోరు 289/3తో ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్ కొనసాగించింది. స్కోరు 300 దాటిన వెంటనే ఓవర్ నైట్ బ్యాటర్ రవీంద్ర జడేజా (28)ను ఖవాజా క్యాచ్ ద్వారా మర్ఫీ పెవిలియన్ చేర్చాడు. దాంతో, నాలుగో వికెట్ కు విరాట్ కోహ్లీతో 64 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. 

అప్పటికే అర్ధ శతకంతో క్రీజులో కుదురుకున్న విరాట్ కోహ్లీకి  తెలుగు ఆటగాడు కేఎస్ భరత్ తోడయ్యాడు. 115 ఓవర్లకు భారత్ 322/4 స్కోరుతో నిలిచింది. కోహ్లీ 70, భరత్ 8 పరుగులతో ఆడుతున్నారు. ఆస్ట్రేలియా స్కోరుకు ఇంకా 158 పరుగుల దూరంలో ఉంది. విరాట్ కోహ్లీ పైనే భారత జట్టు భారం ఉంది. తొలి ఇన్నింగ్స్ లో ఉస్మాన్ ఖవాజ (180), కామెరూన్ గ్రీన్ (114) శతకాలతో ఆస్ట్రేలియా 480 పరుగుల భారీ స్కోరు చేసింది.


More Telugu News