లోకేశ్ పాదయాత్రలో ఈనాటి వివరాలు ఇవిగో!

  • లోకేశ్ పాదయాత్రకు నేడు 41వ రోజు
  • తంబళ్లపల్లి నియోజకవర్గంలో యువగళం
  • లోకేశ్ ను కలిసిన కురుబలు, శాలివాహనులు
  • టీడీపీ అధికారంలోకి వచ్చాక తప్పకుండా ఆదుకుంటామన్న లోకేశ్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 41వ రోజు తంబళ్లపల్లి నియోజకవర్గం కురబలకోట మండలంలో కొనసాగింది. తంబళ్లపల్లి నియోజకవర్గం కురబలకోట మండలం నందిరెడ్డివారిపల్లి విడిది కేంద్రం నుంచి శనివారం ఉదయం పాదయాత్ర ప్రారంభమైంది.

కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉందంటూ లోకేశ్ కు అధికారులు నోటీసులు ఇవ్వగా, ఆయన ఎన్నికల కోడ్ పై గౌరవం ఉందంటూ పాదయాత్రకు రెండ్రోజులు విరామం ప్రకటించి హైదరాబాద్ బయల్దేరారు. మళ్లీ 14వ తేదీ నుంచి పాదయాత్ర షురూ చేస్తానని ప్రకటించారు. ఇవాళ్టి పాదయాత్రలో లోకేశ్ ను కురబలు, శాలివాహనులు కలిశారు. వారు తమ సమస్యలను లోకేశ్ కు వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి టీడీపీ అధికారంలోకి వచ్చాక తప్పకుండా ఆదుకుంటామని లోకేశ్ భరోసా ఇచ్చారు.

లోకేశ్ వ్యాఖ్యల హైలైట్స్...

  • జగన్ పాలనలో అందరూ బాధితులే. జగన్ పెట్రోల్, డీజిల్ పై వేస్తున్న అసాధారణ పన్నుల వలనే నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. టీడీపీ అధికారలోకి వచ్చిన వెంటనే నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తాం. జగన్ అడ్డగోలుగా పెంచిన అన్ని పన్నులు తగ్గిస్తాం. పేదవాడిపై పన్నుల భారం తగ్గిస్తాం.
  • రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం 6 లక్షల పెన్షన్లు కట్ చేసింది. ఆఖరికి చెత్త పన్ను కూడా పెన్షన్ లో కట్ చేసే దారుణమైన సర్కారు జగన్ ప్రభుత్వం. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే అర్హులైన అందరికీ పెన్షన్లు ఇచ్చి తీరుతాం. 
  • జగన్ దెబ్బకి రాష్ట్రంలో కంపెనీలు అన్ని బై బై ఏపీ అన్నాయి. టీడీపీ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లోనే పెద్ద కంపెనీలు రాష్ట్రానికి రాబోతున్నాయి. ప్రతి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఏర్పాటు చేసి చిన్న, మధ్య తరగతి పరిశ్రమలను ప్రోత్సహిస్తాం.
  • కురుబల కోసం కురుబ కార్పొరేషన్ ఏర్పాటుచేసి వారి సంక్షేమానికి కృషిచేసింది టీడీపీ మాత్రమే. కురుబ సామాజికవర్గానికి చెందిన ఎస్ రామచంద్రారెడ్డి, బికె పార్థసారధి, బత్తిన వెంకటరాముడుకి ఎమ్మెల్యేగా, ఎంపీగా, జడ్పీ చైర్మన్ గా అవకాశం కల్పించాం. 
  • టీడీపీ అధికారంలోకి వచ్చాక గొర్రెల మేపుకు బీడు భూములు కేటాయించే అంశాన్ని పరిశీలిస్తాం. కురుబల ఆరాధ్య దైవం కనకదాసు జయంతిని అధికారికంగా నిర్వహిస్తాం. కురుబ భవనాల ఏర్పాటుకు నిధులు కేటాయిస్తాం.
  • శాలివాహన సామాజికవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. ఆదరణ ద్వారా గతంలో వేలాది రూపాయల విలువ చేసే పనిముట్లు అందించాం. టీడీపీ హయాంలో అంగళ్లలో సీఎఫ్సీ భవనం నిర్మించాం. దీంతో వారంతా ఒకేచోట ఉండి పని చేసుకుంటున్నారు.
  • అధికారంలోకి వచ్చాక కంటేవారిపల్లెలోనూ సీఎఫ్సీ బిల్డింగ్ నిర్మించే ప్రయత్నం చేస్తాం. టెర్రాకోట, శాలివాహనుల ఉత్పత్తులను ప్రమోట్ చేసి మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తాం.
  • *టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు:
  • **ఇప్పటి వరకునడిచిన దూరం కి.మీ. 529.1 కి.మీ.
  • **41వరోజు (శనివారం) నడిచిన దూరం – 9.5 కి.మీ.**
  • ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా యువగళం పాదయాత్రకు 12,13 తేదీల్లో విరామం
  • **42 వ రోజు పాదయాత్ర 14-3-2023న కంటేవారిపల్లి నుంచి ప్రారంభమవుతుంది.*


More Telugu News