గుజరాత్ జెయింట్స్ ను కకావికలం చేసిన మరిజానే కాప్
- డబ్ల్యూపీఎల్ లో గుజరాత్ జెయింట్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ ఢీ
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్
- 20 ఓవర్లలో 9 వికెట్లకు 105 పరుగులు
- 5 వికెట్లు పడగొట్టిన మరిజానే కాప్
డబ్ల్యూపీఎల్ లో నేడు ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన గుజరాత్ జెయింట్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 105 పరుగులు మాత్రమే చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ మీడియం పేసర్ మరిజానే కాప్ అద్భుతమైన బౌలింగ్ తో గుజరాత్ జెయింట్స్ టాపార్డర్ ను కుప్పకూల్చింది. కాప్ ధాటికి గుజరాత్ వరుసగా వికెట్లు చేజార్చుకుంది. కాప్ 4 ఓవర్లు బౌలింగ్ చేసి 15 పరుగులిచ్చి 5 వికెట్లు తీసింది.
గుజరాత్ ఇన్నింగ్స్ లో కిమ్ గార్త్ చేసిన 32 పరుగులే అత్యధికం. ఆఖర్లో కిమ్ సాధించిన పరుగుల వల్లే గుజరాత్ స్కోరు 100 మార్కు దాటింది. జార్జియా వేర్ హామ్ 22, హర్లీన్ డియోల్ 20 పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో శిఖా పాండే 3, రాధా యాదవ్ 1 వికెట్ పడగొట్టారు.