ఏపీలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార పర్వం

  • 3 పట్టభద్రుల స్థానాలు, 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు
  • ఈ నెల 13న పోలింగ్
  • ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్
  • ఈ నెల 16న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
ఏపీలో మార్చి 13న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో, 5 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికకు నేటి సాయంత్రంతో ప్రచార గడువు ముగిసింది. రాష్ట్రంలో 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు, 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. 

ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం (తూర్పు రాయలసీమ), కడప-అనంతపురం-కర్నూలు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం (పశ్చిమ రాయలసీమ), శ్రీకాకుళం-విజయనగరం-విశాఖ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం (ఉత్తరాంధ్ర), ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం, కడప-అనంతపురం-కర్నూలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం ఎన్నికలు జరగనున్నాయి. 

ఎల్లుండి సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ నెల 16న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.


More Telugu News