ఓటీటీలోకి అవతార్2.. ఏకంగా 6 గంటల రన్ టైం
- ఈ నెల 28న అమెజాన్ సహా పలు ఓటీటీల్లో స్ట్రీమింగ్
- తొలుత అద్దె చెల్లించి చూసేలా అవకాశం
- చిత్రీకరణ విశేషాలు, ఇంటర్వ్యూలతో 3 గంటల ప్రత్యేక వీడియో
హాలీవుడ్ దర్శక దిగ్గజం జేమ్స్ కామెరూన్ రూపొందించిన విజువల్ వండర్ అవతార్ ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులను ఎంతగానో అలరించింది. గతేడాది విడుదలైన అవతార్ 2 చిత్రానికి కలెక్షన్ల వర్షం కురిసింది. భారత్ తో పాటు అన్ని దేశాల్లో పలు రికార్డులు బద్దలయ్యాయి. ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. మార్చి 28వ తేదీన అమెజాన్ ప్రైమ్, యాపిల్ టీవీతోపాటు మరికొన్ని ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లో ఈ సినిమా స్ట్రీమ్ కానుంది. అయితే, మార్చి 28వ తేదీ డిజిటల్ రిలీజ్ అవుతున్న అవతార్ 2ను చూడాలంటే అద్దె చెల్లించాల్సి ఉంటుంది.
తొలుత రెంట్ ఆన్ డిమాండ్ కింద ఈ చిత్రం అందుబాటులో ఉంటుంది. అయితే, థియేటర్ కు భిన్నంగా ఓటీటీలో సినిమాకు అదనంగా చిత్రం షూటింగ్ విశేషాలు, ఇంటర్వ్యూలు మరో మూడు గంటల ప్రత్యేక వీడియో కూడా అందుబాటులో ఉండనుంది. అవతార్ 2 చిత్రం రన్ టైం మూడు గంటలు ఉంది. దీనికి అదనంగా మరో మూడు గంటల ప్రత్యేక వీడియోతో మొత్తంగా ఓటీటీలో ఆరు గంటల రన్ అందుబాటులో ఉండనుంది. కాగా, అవతార్ 2 ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఇంకా థియేటర్లలో ఈ సినిమా ఆడుతూనే ఉంది.