గిల్ సెంచరీ.... టీమిండియా స్కోరు 187-2
- అహ్మదాబాద్ లో టీమిండియా వర్సెస్ ఆసీస్
- తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ స్కోరు 480 రన్స్
- దీటుగా బదులిస్తున్న టీమిండియా
అహ్మదాబాద్ టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ శుభ్ మాన్ గిల్ శతకం సాధించాడు. 194 బంతుల్లో సెంచరీ మార్కు దాటాడు. గిల్ స్కోరులో 10 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో 480 పరుగులు చేయడం తెలిసిందే.
ఇవాళ మూడో రోజు ఆటలో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా ప్రస్తుతం 2 వికెట్లకు 187 పరుగులతో ఆడుతోంది. కెప్టెన్ రోహిత్ శర్మ 35 పరుగులు చేసి కుహ్నెమన్ బౌలింగ్ లో అవుటయ్యాడు. ఆ తర్వాత గిల్, పుజారా జోడీ వికెట్ కాపాడుకుంటూనే వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీ దాటిస్తూ స్కోరు బోర్డును ముందుకు నడిపిస్తోంది.
పుజారా 42 పరుగులు చేసి మర్ఫీ బౌలింగ్ లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ప్రస్తుతం క్రీజులో గిల్ 102 పరుగులతోనూ, కోహ్లీ పరుగులేమీ లేకుండానూ ఆడుతున్నారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు టీమిండియా ఇంకా 293 పరుగుల దూరంలో ఉంది.