48 గంటల్లో కుప్పకూలిన అమెరికా బ్యాంక్.. కారణాలు ఇవే!
- మునిగిపోయిన స్టార్టప్ ల ఆశా కిరణం సిలికాన్ వ్యాలీ బ్యాంకు
- బ్యాంకు చేసిన పెట్టుబడుల విలువ పతనం
- కస్టమర్ల నుంచి ఉపసంహరణలకు ఒత్తిళ్లు
- బ్యాంక్ ను సీజ్ చేసిన నియంత్రణ సంస్థలు
అమెరికాలో మధ్యస్థాయి బ్యాంకుల్లో ఒక్కటైన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్ వీబీ) కుప్పకూలింది. కేవలం 48 గంటల్లోనే బ్యాంకు పీకల్లోతు సంక్షోభంలో మునిగిపోయింది. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత అమెరికాలో చోటు చేసుకున్న అతిపెద్ద బ్యాంకు వైఫల్యం ఇది. ఈ బ్యాంక్ టెక్నాలజీ వెంచర్లు, స్టార్టప్ లకు నిధులను అందిస్తుంటుంది. స్టార్టప్ సంస్థలు పెద్ద ఎత్తున ఈ బ్యాంకునే నమ్ముకుని పనిచేస్తున్నాయి. బ్యాంకు సంక్షోభం వార్తలు దావానలంలా వ్యాపించడంతో ఇన్వెస్టర్లు 48 గంటల్లోనే 42 బిలియన్ డాలర్లను (గురువారం నాటికి) వెనక్కి తీసుకున్నారు. దీంతో బ్యాంకు చేతులెత్తేసింది. క్యాలిఫోర్నియా రెగ్యులేటర్లు బ్యాంకును మూసేసి, యూఎస్ ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నియంత్రణలోకి తీసుకొచ్చారు. సోమవారం నుంచి కస్టమర్లకు డిపాజిట్ల చెల్లింపులు చేయనున్నట్టు ప్రకటించారు.
తన బ్యాలన్స్ షీట్ ను బలోపేతం చేసుకునేందుకు 2.25 బిలియన్ డాలర్ల నిధులు సమీకరించాల్సిన అవసరం ఉందని బుధవారం సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ప్రకటించింది. ఈ ప్రకటనే బ్యాంకు మునిగిపోవడానికి నాందీ అని చెప్పుకోవాలి. బ్యాంకు ప్రకటనలోని అంతరార్థాన్ని వెంచర్ క్యాపిటల్ సంస్థలు, స్టార్టప్ (బ్యాంకు కస్టమర్లు) లు గ్రహించాయి. దీంతో బ్యాంకు నుంచి డిపాజిట్లు వెనక్కి తీసుకోవడం మొదలు పెట్టాయి. కస్టమర్ల నుంచి ఉపసంహరణ ఒత్తిళ్లు పెరిగిపోవడంతో మార్ట్ గేజ్ బ్యాక్డ్ బాండ్లలో తనకున్న పెట్టుబడులను సిలికాన్ వ్యాలీ బ్యాంక్ విక్రయించేసింది.
స్టార్టప్ లు సాధారణంగా వెంచర్ క్యాపిటల్, ప్రైవేటీ ఈక్విటీ సంస్థల నుంచి నిధులు సమీకరిస్తుంటాయి. వాటిని సిలికాన్ వ్యాలీ బ్యాంకులోనే డిపాజిట్ చేసి వాడుకుంటూ ఉంటాయి. ఐపీవో ద్వారా సమీకరించే నిధులను కూడా ఇదే బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేసి ఉంచుతుంటాయి. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ఆ డిపాజిట్లను తీసుకెళ్లి మార్ట్ గేజ్ బ్యాక్డ్ బాండ్లలో ఇన్వెస్ట్ చేసింది. ఒకటిన్నర శాతం లోపు వడ్డీకి డిపాజిట్ చేసింది. కానీ, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 5 శాతం దాటించేయడంతో అక్కడ రిటైల్ రేట్లు 6 శాతంకు చేరాయి. ఫలితంగా సిలికాన్ వ్యాలీ బ్యాంకు ఇన్వెస్ట్ చేసిన బాండ్ల విలువ పడిపోయింది.
అమెరికాలో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు లిక్విడిటీని కఠినతరం చేస్తున్నారు. దీంతో నిధుల లభ్యత కష్టంగా మారింది. రేట్లు పెరిగిపోయాయి. దీంతో సిలికాన్ వ్యాలీ బ్యాంకులో డిపాజిట్ చేసిన సంస్థలు తమ నిధులను వెనక్కి తీసుకునేందుకు మొగ్గు చూపించాయి. కానీ, అదే సమయంలో ఆ డబ్బులను ఇన్వెస్ట్ చేసిన చోట, వాట విలువ పడిపోయింది. కస్టమర్ల నుంచి విత్ డ్రా కోసం ఒత్తిడి పెరగడంతో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ 1.8 బిలియన్ డాలర్ల నష్టానికి పెట్టుబడులను విక్రయించాల్సి వచ్చింది.
ఈ వార్తల నేపథ్యంలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ మాతృ సంస్థ సిలికాన్ వ్యాలీ ఫైనాన్షియల్ గ్రూప్ షేరు శుక్రవారం ప్రీ మార్కెట్ ట్రేడ్ లో 69 శాతం పడిపోయింది. క్యాలిఫోర్నియా రెగ్యులేటర్ సత్వరమే స్పందించింది. ఈ సంక్షోభం ఇతర సంస్థలపై పడకుండా బ్యాంకును సీజ్ చేసి వేగంగా నివారణ చర్యలు తీసుకుంది. ఈ బ్యాంకు ఆస్తుల విలువ 209 బిలియన్ డాలర్లు ఉంటే, డిపాజిట్ల విలువ 175 బిలియన్ డాలర్లుగా ఉంది. బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గ్రెగ్ బెకర్.. కస్టమర్ల డిపాజిట్లు బ్యాంకు దగ్గర భద్రంగానే ఉన్నాయంటూ చేసిన ప్రకటన నమ్మకాన్ని ఇవ్వలేకపోయింది.
గతేడాది అమెరికాలో ఐపీవోకు వచ్చిన టెక్నాలజీ హెల్త్ కేర్ కంపెనీల్లో సగం మేర సిలికాన్ వ్యాలీ బ్యాంక్ నుంచి నిధులు పొందినవే ఉన్నాయి. బ్యాంకు కుప్పకూలిపోవడం ఇప్పుడు అక్కడి స్టార్టప్ లపై ప్రభావం చూపించనుంది. కొత్త వాటికి ఫండింగ్ సమస్యతోపాటు, బ్యాంకులో డిపాజిట్లు ఉన్న సంస్థలకు అవి తిరిగి రావాల్సి ఉంది. కస్టమర్లు 42 బిలియన్ డాలర్లనే ఉపసంహరించుకోగలిగారు. ఇంకా 133 బిలియన్ డాలర్ల డిపాజిట్లు కంపెనీలకు చేరాల్సి ఉంది.