భారత్‌లో ప్రతి 4 నిమిషాలకో మరణం..కారణం అదే: ఎయిమ్స్ వైద్యురాలు

  • భారత్‌లో మరణాలకు బ్రెయిన్ స్ట్రోక్ రెండో ప్రాధాన కారణమన్న ఎయిమ్స్ ప్రొఫెసర్ డా. పద్మ
  • భారత్‌లో ఏటా 1.85 లక్షల మంది స్ట్రోక్ బారిన పడుతున్నారని వెల్లడి
  • దేశంలో స్ట్రోక్ చికిత్సకు తగిన వసతులు లేవని ఆందోళన
భారత్‌లో అనారోగ్యం కారణంగా సంభవిస్తున్న మరణాలకు బ్రెయిన్ స్ట్రోక్ రెండో ప్రధాన కారణమని ప్రముఖ న్యూరాలజిస్ట్, ఎయిమ్స్ ప్రొఫెసర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత డా. ఎంవీ పద్మ శ్రీవాత్సవ తాజాగా పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఢిల్లీలోని శ్రీ గంగా రామ్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. భారత్‌లో ఏటా 1.85 లక్షల మంది బ్రెయిన్ స్ట్రోక్ బారినపడుతున్నారని, అంటే ప్రతి నలభై సెకెన్లకు ఒకరు స్ట్రోక్ బారినపడుతున్నట్టని వ్యాఖ్యానించారు. భారత్‌లో స్ట్రోక్ కారణంగా ప్రతి 4 నిమిషాలకు ఒకరు మరణిస్తున్నారని చెప్పారు. 

స్ట్రోక్ బాధితులకు వైద్యసాయానికి కావాల్సిన మౌలిక వసతులు దేశంలో లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. దీని వల్ల రోగులకు తక్షణ వైద్యం అందడం లేదని పేర్కొన్నారు. టెలీ స్ట్రోక్ మెడిసిన్, టెలీస్ట్రోక్ ఫెసిలిటీల ఏర్పాటుతో ఈ సమస్యను కొంతవరకూ పరిష్కరించవచ్చన్నారు. ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాల్లోని వారికి ఈ విధానంతో సత్వర వైద్యం అందించి మరణాలను నివారించవచ్చని పేర్కొన్నారు.


More Telugu News