హోలీ రోజున ఏడేళ్ల బాలికపై అత్యాచారం!

  • బీహార్‌లో వెలుగు చూసిన ఘటన
  • మద్యం మత్తులో నిందితుడు బాలికపై అత్యాచారం
  • నిందితుడిని అడ్డుకోబోయిన బాలిక స్నేహితురాలికి గాయాలు
హోలీ నాడే ఓ బాలిక జీవితం అంధకారంలో కూరుకుపోయింది. మద్యం మైకంలో ఓ వ్యక్తి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బీహార్‌లోని బేగుసరాయ్ జిల్లాలో ఈ దారుణం వెలుగు చూసింది. స్నేహితురాలితో కలిసి మార్కెట్ నుంచి తిరిగి వస్తున్న బాలిక(7) దారిలో తన స్కూల్ వద్ద ఆగింది. అక్కడ స్నేహితురాళ్లిద్దరూ ఊయ్యాల ఆట ఆడుకుంటుండగా నిందితుడి కన్ను ఆమెపై పడింది. బాధితురాలిని స్కూల్ టాయిలెట్‌లోకి తీసుకెళ్లి బలాత్కరించాడు. నిందితుడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన బాలిక ఫ్రెండ్(9) గాయపడింది. ఈ దారుణానికి పాల్పడ్డ ఛోటూ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు.


More Telugu News