కానిస్టేబుల్ నియామకాల ఫిజికల్ ఈవెంట్ల వాయిదా
- ఏపీలో 6,100 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్
- జనవరిలో ప్రిలిమ్స్ నిర్వహణ
- ఈ నెల 14న ఫిజికల్ ఈవెంట్లు
- ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు, అసెంబ్లీ సమావేశాలు
- ఫిజికల్ ఈవెంట్లకు మరో తేదీ ప్రకటిస్తామన్న కౌన్సిల్
ఏపీలో భారీ ఎత్తున పోలీస్ నియామకాలు చేపట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో 6,100 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ ఇటీవలే విడుదలైంది. ఈ క్రమంలో కానిస్టేబుల్ అభ్యర్థులకు మార్చి 14న ఫిజికల్ ఈవెంట్లు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే, ఇప్పుడా ఫిజికల్ ఈవెంట్లు వాయిదా పడ్డాయి.
ఏపీలో మార్చి 13న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 14 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, పోలీసు కానిస్టేబుల్ పీఎంటీ/పీఈటీ ఫిజికల్ ఈవెంట్లు వాయిదా వేస్తున్నట్టు పోలీస్ రిక్రూట్ మెంట్ కౌన్సిల్ వెల్లడించింది. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని, త్వరలోనే కొత్త తేదీలు ప్రకటిస్తామని పేర్కొంది. తాజా సమాచారం కోసం తమ వెబ్ సైట్ చూస్తుండాలని తెలిపింది.
పోలీసు నియామకాల కోసం గత జనవరి 22న ప్రిలిమ్స్ నిర్వహించడం తెలిసిందే. 4.59 లక్షల మంది ఈ ప్రాథమిక పరీక్షకు హాజరు కాగా, వారిలో ఉత్తీర్ణులైంది 95,209 మంది మాత్రమే. వీరి దేహదారుఢ్యాన్ని పరీక్షించేందుకు ఫిజికల్ ఈవెంట్లు నిర్వహించనున్నారు.