అశ్విన్ కు 6 వికెట్లు... ఆసీస్ 480 ఆలౌట్

  • అహ్మదాబాద్ లో చివరి టెస్టు
  • తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోరు సాధించిన ఆసీస్
  • ఖవాజా, గ్రీన్ సెంచరీలు.. రాణించిన టెయిలెండర్లు
అహ్మదాబాద్ టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (180) భారీ సెంచరీ, ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ (114) శతకం సాయంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 480 పరుగులు చేసింది. 

చివర్లో ఆస్ట్రేలియా టెయిలెండర్లు టాడ్ మర్ఫీ 41, నాథన్ లైయన్ 34 పరుగులు చేసి భారత బౌలర్లకు సవాల్ గా నిలిచారు. వీరిద్దరినీ అశ్విన్ అవుట్ చేయడంతో ఆసీస్ ఇన్నింగ్స్ కు తెరపడింది. ఈ ఇన్నింగ్స్ లో అశ్విన్ 6 వికెట్లు తీయడం విశేషం. షమీ 2, జడేజా 1, అక్షర్ పటేల్ 1 వికెట్ తీశారు. అలెక్స్ క్యారీ డకౌట్ కాగా, స్టార్క్ 6 పరుగులకు అవుటయ్యాడు. ఆసీస్ లోయర్డార్ మొత్తం అశ్విన్ ఖాతాలోకే చేరింది. 

అనంతరం, రెండో రోజు ఆట చివరి సెషన్ లో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. శుభ్ మాన్ గిల్ 10, కెప్టెన్ రోహిత్ శర్మ 8 పరుగులతో ఆడుతున్నారు.


More Telugu News