ఈరోజు కూడా స్టాక్ మార్కెట్లకు భారీ నష్టాలు

  • 671 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 176 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • భారీగా పతనమైన బ్యాంకింగ్ స్టాకులు
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా భారీగా పతనమయ్యాయి. అంతర్జాతీయంగా సానుకూలతలు లేకపోవడం మార్కెట్లపై ప్రభావం చూపింది. ఈరోజు బ్యాంకింగ్, రియాల్టీ స్టాకులు భారీగా పతనమయ్యాయి. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 671 పాయింట్లు కోల్పోయి 59,135కి పడిపోయింది. నిఫ్టీ 176 పాయింట్లు పతనమై 17,412కి దిగజారింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా మోటార్స్ (0.82%), మారుతి (0.76%), ఎన్టీపీసీ (0.75%), సన్ ఫార్మా (0.37%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (0.33%). 

టాప్ లూజర్స్:
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-2.63%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-2.12%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-2.09%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.02%), యాక్సిస్ బ్యాంక్ (-1.89%).


More Telugu News