వైఎస్ వివేకా హత్య కేసు విచారణ వాయిదా

  • ఈనెల 31కి కేసును వాయిదా వేసిన సీబీఐ కోర్టు
  • కోర్టుకు హాజరైన నిందితులు 
  • చంచల్ గూడ జైలుకు నిందితులు
వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐ కోర్టు ఈ నెల 31కి వాయిదా వేసింది. ఈ కేసులో విచారణకు జ్యూడిషియల్ ఖైదీలుగా ఉన్న సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దేవి రెడ్డి శివశంకర్ రెడ్డితో పాటూ గంగిరెడ్డి, దస్తగిరి హాజరయ్యారు. భారీ బందోబస్తు నడుమ వీరిని కోర్టుకు తీసుకువచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం విచారణ ఈ నెలాఖరుకు వాయిదా పడింది. విచారణ అనంతరం... జ్యుడీషియల్ ఖైదీలను చంచల్ గూడా జైలుకు తరలించారు. 

2019లో వివేకా హత్య సంచలనం సృష్టించడం తెలిసిందే. ఈ కేసు విచారణను ఇటీవలే తెలంగాణకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.



More Telugu News