బీర్ తాగితే కిడ్నీ స్టోన్స్ తగ్గుతాయా..?

  • ప్రిస్టీన్ సంస్థ నిర్వహించిన సర్వేలో ఒక వంతు మంది సమాధానం ఇదే
  • 2022లో 180 శాతం పెరిగిన కిడ్నీ డాక్టర్ కన్సల్టేషన్లు
  • మహిళలతో పోలిస్తే పురుషులకు మూడు రెట్లు ఎక్కువ రిస్క్
మూత్రపిండాల్లో రాళ్లు (కిడ్నీ స్టోన్స్) ఏర్పడే సమస్య మన దేశంలో పెరుగుతోంది. కిడ్నీల పనితీరు, రిస్క్ గురించి చాలా మందికి అవగాహన ఉండడం లేదు. కిడ్నీ స్టోన్స్ సమస్య పెరగడానికి ఇది కూడా ఒక కారణం. ప్రపంచ కిడ్నీ దినోత్సవం (మార్చి 9) సందర్భంగా ఆన్ లైన్ హెల్త్ కేర్ సేవల సంస్థ ప్రిస్టీన్ ఓ సర్వే నిర్వహించింది. ఆశ్చర్యం ఏమిటంటే.. సర్వేలో అభిప్రాయాలు తెలియజేసిన వారిలో ప్రతి ముగ్గురికి గాను ఒకరు.. బీర్ తాగితే కిడ్నీ స్టోన్స్ తగ్గిపోతాయని చెప్పారు. సర్వేలో 1000 మంది వరకు పాల్గొన్నారు.

  • కిడ్నీ స్టోన్స్ చికిత్సను ఆరు నెలల నుంచి రెండేళ్ల వరకు జాప్యం చేసినట్టు 50 శాతం మంది చెప్పారు.
  • మన దేశంలో కిడ్నీ సమస్యలు పెరుగుతున్నాయనడానికి నిదర్శనంగా 2021తో పోలిస్తే 2022లో కిడ్నీ సమస్యల కోసం తీసుకునే ఆన్ లైన్ అపాయింట్ మెంట్లు 180 శాతం పెరిగాయి. వీటిల్లో ఎక్కువ కన్సల్టేషన్లు కిడ్నీ స్టోన్ల కోసమే.
  • మహిళలతో పోలిస్తే పురుషుల్లో ఈ సమస్య మూడు రెట్లు ఎక్కువగా ఉంది.
  • కిడ్నీస్టోన్స్ కు మధుమేహం, డయాబెటిస్ ప్రధాన కారణాలుగా ఉంటున్నాయి. కానీ ఈ విషయంపై 14 శాతం మందికే అవగాహన ఉంది.
  • మూత్రపిండాలు మూత్రాన్ని తయారు చేస్తాయని సగం మందికి తెలియకపోవడం ఆశ్చర్యకరం.
  • కిడ్నీలు ప్రొటీన్లను విచ్ఛిన్నం చేస్తాయని తెలిసిన వారు 9 శాతం మందే.
  • ప్రొటీన్ సప్లిమెంట్లతో కిడ్నీ స్టోన్స్ వస్తాయని సగానికి పైగా సర్వేలో చెప్పారు.
  • సర్వే ఫలితాలు కిడ్నీ ఆరోగ్యం పట్ల సరైన అవగాహన లేదని తెలియజేస్తున్నట్టు ప్రిస్టీన్ కేర్ పేర్కొంది.


More Telugu News