అలర్ట్! బ్యాంకు కొలువుల నోటిఫికేషన్.. నెలకు రూ.40 వేల శాలరీ

  • బ్యాంక్ ఆఫ్ బరోడాలో 546 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
  • కనీస వేతనం రూ. 40 వేలు
  • దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ మార్చి 14
బ్యాంకు జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ఓ అలర్ట్! వివిధ పోస్టులు భర్తీ చేసేందుకు బ్యాంక్ ఆఫ్ బరోడా ఇటీవల ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు సమర్పించేందుకు చివరి తేదీ మరో ఐదు రోజుల్లో ముగియనుంది. వెల్త్ మేనేజ్‌మెంట్ సేవలను విస్తరించే క్రమంలో బ్యాంక్ ఆఫ్ బరోడా పలు పోస్టుల భర్తీకి సిద్ధమైంది. మొత్తం 546 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాంకు ప్రకటన ప్రకారం.. ఈసారి 500 అక్విజిషన్ ఆఫీసర్ పోస్టులు, 15 ప్రైవేటు బ్యాంకర్ పోస్టులు, 19 వెల్త్ స్ట్రాటజిస్ట్ పోస్టులు భర్తీ చేయనున్నారు. 

ఈ పోస్టులకు సంబంధించి ఫిబ్రవరి 22న బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ మార్చి 14. మెట్రో నగరాల్లో పని చేసేవారి కనీస వేతనం రూ.5 లక్షలు కాగా.. నాన్ మెట్రో నగరాల్లో ఎంపికైన వారికి వార్షిక వేతనం రూ. 4 లక్షలుగా ఖరారు చేశారు. అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించాక ఆన్‌లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూల్లో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వైజాగ్, హైదరాబాద్‌ నగరాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.


More Telugu News