ప్రపంచ చాంపియన్ ఇంగ్లండ్‌కు షాకిచ్చిన బంగ్లాదేశ్.. టీ20ల్లో తొలిసారి ఇంగ్లిష్ జట్టుపై విజయం!
- 157 పరుగుల లక్ష్యాన్ని మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే అందుకున్నబంగ్లాదేశ్
- పొట్టి ఫార్మాట్‌లో ఇంగ్లండ్‌పై ఆ జట్టుకు ఇదే తొలి విజయం
- ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నజ్ముల్ హొసైన్
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో విజయం సాధించిన బంగ్లాదేశ్ తొలిసారి ఆ ఘనత అందుకుంది. టీ20 ఫార్మాట్‌లో ఇంగ్లండ్‌పై ఆ జట్టుకు ఇదే తొలి విజయం. చట్‌గావ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. కెప్టెన్ జోస్ బట్లర్ 42 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 67 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
అనంతరం 157 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 4 వికెట్లు మాత్రమే కోల్పోయి మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నజ్ముల్ హొసైన్ 30 బంతుల్లో 8 ఫోర్లతో 51 పరుగులు చేయగా, కెప్టెన్ షకీబల్ హసన్ 34 పరుగులు చేశాడు. ఇరు జట్ల మధ్య రెండో మ్యాచ్ ఈ నెల 12న ఢాకాలో జరుగుతుంది.