ముగిసిన తెలంగాణ క్యాబినెట్ భేటీ... పలు నిర్ణయాలకు ఆమోదం

  • సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ క్యాబినెట్ సమావేశం
  • మీడియాకు వివరాలు తెలిపిన మంత్రి హరీశ్ రావు
  • రాష్ట్రంలో 1.30 లక్షల మందికి దళితబంధు
  • గృహలక్ష్మి ద్వారా 4 లక్షల మంది పేదలకు ఇళ్లు
  • లబ్దిదారుడికి రూ.3 లక్షల గ్రాంట్
సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ క్యాబినెట్ సమావేశం ముగిసింది. పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 

దీనిపై మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, రాష్ట్రంలో 1.30 లక్షల కుటుంబాలకు దళితబంధు ఇవ్వనున్నామని వెల్లడించారు. ఇప్పటికే తొలి విడత అమలు చేశామని, త్వరలోనే రెండో విడత చేపడతామని అన్నారు. 

గృహలక్ష్మి పథకం ద్వారా 4 లక్షల మంది పేదలకు ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు. నియోజకవర్గానికి 3 వేల చొప్పున ఇళ్లు కేటాయించడం జరుగుతుందని చెప్పారు. లబ్దిదారుడికి రూ.3 లక్షల గ్రాంట్ ఇస్తామని హరీశ్ రావు వెల్లడించారు. లబ్దిదారుల ఎంపిక వెంటనే చేపట్టాలని క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించినట్టు వివరించారు. 

ఏప్రిల్ 14న దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహానికి ప్రారంభోత్సవం చేయనున్నట్టు తెలిపారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, పోడు భూముల పట్టాల అంశంపైనా క్యాబినెట్ లో విపులంగా చర్చించినట్టు హరీశ్ రావు వెల్లడించారు.


More Telugu News