కవితకు ఈడీ నోటీసులు పంపితే తెలంగాణకు అవమానం జరిగినట్టా?: భట్టి విక్రమార్క
- ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితపై ఆరోపణలు
- విచారణకు రావాలంటూ ఈడీ నోటీసులు
- కవితకు నోటీసులు పంపితే తెలంగాణ ప్రజలకు ఆపాదిస్తున్నారన్న భట్టి
- దర్యాప్తు సంస్థలకు కవిత సహకరించాలని హితవు
ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. లిక్కర్ స్కాంలో కవితపై ఆరోపణలు వచ్చాయని, దర్యాప్తు సంస్థలకు ఆమె సహకరించాలని హితవు పలికారు.
కవితకు నోటీసులు వస్తే తెలంగాణకు జరిగిన అవమానంగా ప్రచారం చేస్తున్నారని భట్టి పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు ఏమైనా ఢిల్లీ వెళ్లి లిక్కర్ స్కాంకు పాల్పడ్డారా? అని ప్రశ్నించారు. ఈడీ నోటీసులు కవితకు, బీఆర్ఎస్ కు మాత్రమే సంబంధించిన విషయం అని స్పష్టం చేశారు.
కవితను ఈడీ విచారణకు పిలిస్తే దాన్ని తెలంగాణ ప్రజలకు ఆపాదించవద్దని అన్నారు. తప్పు చేస్తే ఎంతటివారికైనా శిక్ష పడాల్సిందేనని భట్టి ఉద్ఘాటించారు.