'ప్రభాస్ తో లవ్ ఎఫైర్' అంటూ వరుణ్ ధావన్ చేసిన పరోక్ష వ్యాఖ్యలపై కృతి సనన్ స్పందన
- కృతిని ఓ వ్యక్తి హృదయంలో పెట్టుకున్నాడన్న వరుణ్
- ఆ వ్యాఖ్యలతో దిగ్భ్రాంతికి గురయ్యానన్న కృతి సనన్
- ప్రభాస్ తనకు స్నేహితుడు మాత్రమేనని స్పష్టీకరణ
ఓ రియాలిటీ షో వేదికపై బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ చేసిన వ్యాఖ్యలు తనను ఎంతగానో బాధించాయని హీరోయిన్ కృతి సనన్ తెలిపింది. ప్రభాస్ తో కృతి సనన్ ప్రేమలో ఉందంటూ వరుణ్ ధావన్ పరోక్ష వ్యాఖ్యలు చేశాడని, ఆ వ్యాఖ్యలు వినగానే దిగ్భ్రాంతికి గురయ్యానని వెల్లడించింది.
ఇదే విషయాన్ని ప్రభాస్ కు ఫోన్ చేసి వివరించానని, వరుణ్ ధావన్ అలా ఎందుకన్నాడు? అని ప్రభాస్ అడిగాడని కృతి సనన్ వివరించింది. వరుణ్ ధావన్ వెర్రితనంతో ఆ వ్యాఖ్యలు చేసి ఉంటాడని ప్రభాస్ తో చెప్పానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ప్రభాస్ తనకు స్నేహితుడు మాత్రమేనని ఆమె స్పష్టం చేసింది.
ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్ సరసన కృతి సనన్ హీరోయిన్ అన్న విషయం తెలిసిందే. అయితే, బేడియా చిత్రం ప్రమోషన్స్ సందర్భంగా వరుణ్ ధావన్ తో కలిసి కృతి సనన్ ఓ ప్రమోషనల్ ఈవెంట్ లో పాల్గొంది.
కృతి ఓ వ్యక్తి హృదయంలో చోటు సంపాదించుకుందని, ఆ వ్యక్తి ఇప్పుడు దీపిక పదుకుణేతో కలిసి చిత్రీకరణలో ఉన్నాడంటూ వరుణ్ ధావన్ పరోక్షంగా వ్యాఖ్యానించాడు.. ప్రభాస్, దీపిక జంటగా ప్రాజెక్ట్ కె చిత్రంలో నటిస్తుండడంతో, వరుణ్ ధావన్ ప్రస్తావించింది ప్రభాస్ గురించేనని అందరికీ అర్థమైంది.