హృదయాలను గెలుచుకున్న సృజనాత్మక ప్రతిభావంతుడు.. సతీష్: ప్రధాని మోదీ
- బాలీవుడ్ నటుడు సతీష్ కౌశిక్ మరణంపై దిగ్భ్రాంతి
- ఆయన సినిమాలు వినోదాన్ని పంచుతూనే ఉంటాయన్న ప్రధాని
- కుటుంబ సభ్యులు, అభిమానులకు సానుభూతి వ్యక్తీకరణ
ప్రముఖ నటుడు సతీష్ కౌశిక్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఆయనకు నివాళిగా ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ‘‘ప్రముఖ నటుడు శ్రీ సతీష్ కౌశిక్ జీ అకాల మరణం బాధకు గురి చేసింది. హృదయాలను గెలుచుకున్న సృజనాత్మక ప్రతిభావంతుడు. ఆయన అద్భుతమైన నటన, దర్శకత్వానికి ధన్యవాదాలు. ఆయన చేసిన సినిమాలు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూనే ఉంటాయి. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి’’ అంటూ ప్రధాని ట్వీట్ చేశారు.
గుండె పోటుతో బుధవారం అర్ధరాత్రి సతీష్ కౌశిక్ మరణించడం తెలిసిందే. అంత్యక్రియలు నేటి సాయంత్రం ముంబైలోని వెర్సోవా శ్మశాన వాటికలో జరుగుతాయి. ఢిల్లీ నుంచి ఆయన భౌతిక కాయాన్ని ముంబైకి తరలించే సరికి మధ్యాహ్నం 3 గంటలు అవుతుందని భావిస్తున్నారు. అంత్యక్రియలు సాయంత్రం 5-6 గంటల మధ్యలో జరగొచ్చని తెలుస్తోంది.