'తమ్ముడూ నువ్వు కొంచెం రిలాక్స్ అవ్వు' అని జడేజాకు చెబుతుంటా: రోహిత్ శర్మ

  • తన ప్రతీ బంతికి వికెట్ వస్తుందని జడేజా భావిస్తాడన్న రోహిత్
  • మూడో టెస్టులో జడ్డూ వల్ల రివ్యూలు కోల్పోయామన్న భారత కెప్టెన్
  • నాలుగో మ్యాచ్ లో ఆ తప్పిదాలు చేయమని హామీ
భారత స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాపై కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బౌలింగ్ చేస్తున్నప్పుడు జడేజా తన ప్రతీ బంతికి వికెట్ వస్తుందని అనుకుంటాడని చెప్పాడు. బ్యాటర్ ప్యాడ్లకు బంతి తగిలిన ప్రతీసారి ఎల్బీడబ్ల్యూ అయిందని భావిస్తాడని తెలిపాడు. తీరా డీఆర్ఎస్ కోరితే ప్రతికూల ఫలితం వస్తుందన్నాడు. ఇండోర్ లో జరిగిన మూడో టెస్టు తొలి రోజే భారత్ తొలి రోజే మూడు రివ్యూలు కోల్పోగా.. ఇందులో రెండు జడేజా బౌలింగ్ లో అప్పీల్ చేసినవే. నాలుగో టెస్టు సందర్భంగా ఈ విషయంపై రోహిత్ మాట్లాడాడు. రివ్యూల విషయంలో మరికాస్త అప్రమత్తంగా ఉండాలన్నాడు. 

ఈ క్రమంలో జడేజా రివ్యూ కోరుదామని చెప్పినప్పుడల్లా... ముందు నువ్వు రిలాక్స్ అవ్వు. బంతి గమనం ఎలా ఉండో చూడమని అతనికి సూచిస్తున్నట్టు రోహిత్ వెల్లడించాడు. ‘జడ్డూ (జడేజా) ప్రతి బంతికి బ్యాటర్ ఔట్ అయ్యాడని అనుకుంటాడు. బంతి ప్యాడ్ కి తాకడమే ఆలస్యం.. గట్టిగా అప్పీల్ చేస్తుంటాడు. ఆటపై అభిరుచి ఉంటే ఇలానే ఉంటుంది. కానీ, అప్పుడే నేను సీన్ లోకి వస్తాను. తమ్ముడు.. నువ్వు కొంచెం రిలాక్స్ అవ్వు. బంతి కనీసం వికెట్ల మీదకు కూడా వెళ్లడం లేదు. కనీసం లైన్ పై కూడా పిచ్ అవ్వలేదని చెబుతుంటా. మూడో టెస్టులో మేం ఇలాంటి వెర్రి తప్పులు చేశాం. ఈ మ్యాచ్ లో దాన్ని సరిదిద్దాలని భావిస్తున్నాం' అని రోహిత్ పేర్కొన్నాడు.


More Telugu News