నరేంద్ర మోదీ స్టేడియంలో క్రికెట్ అభిమానులకు రెండు దేశాల ప్రధానుల అభివాదం.. వీడియో ఇదిగో

  • అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, ఆసీస్ మ్యాచ్ 
  • 75 ఏళ్ల స్నేహ బంధానికి ప్రతీకగా ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు 
  • ఓపెన్ టాప్ జీపుపై నుంచి మోదీ, అల్బనీస్ అభివాదం
  • తమ జట్ల కెప్టెన్ లకు టెస్ట్ క్యాప్ అందించిన ప్రధానులు
అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ నేడు మొదలైంది. దీనికి ముందు ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్, భారత ప్రధాని నరేంద్ర మోదీ ఓపెన్ టాప్ జీప్ పై కలియ దిరిగారు. ఇరు ప్రధానులు చేత్తో వీక్షకులకు అభివాదం చేస్తూ మైదానంలో చుట్టూ తిరిగారు. ఈ సందర్భంగా ప్రేక్షకుల్లో తెగ ఉత్సాహం కనిపించింది. క్రికెట్ బ్యాట్ లతో వాహనాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. భారత్-ఆస్ట్రేలియా 75 ఏళ్ల స్నేహ బంధానికి ప్రతీకగా ఈ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. 

అంతకుముందు ఇరు ప్రధానులూ తమ జట్ల కెప్టెన్ కు టెస్ట్ క్యాప్ లను అందించారు. మైదానంలోకి నడుచుకుంటూ వచ్చి తమ తుది జట్టులోని ఆటగాళ్లు అందరినీ ఇరుదేశాల ప్రధానులు పలకరించారు. ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు చోటు లభించాలంటే ఈ టెస్ట్ లో భారత్ గెలవాల్సి ఉంటుంది. ఇండోర్ విజయంతో ఆస్ట్రేలియా ఇప్పటికే బెర్త్ సంపాదించేసింది.


More Telugu News