ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత దీక్షలో విపక్షాల బల ప్రదర్శన

ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత దీక్షలో విపక్షాల బల ప్రదర్శన
  • మహిళా బిల్లు అమలు కోసం రేపు జంతర్ మంతర్ వద్ద దీక్ష
  • ఆమెకు సంఘీభావం ప్రకటించనున్న పలు పార్టీల నేతలు
  • చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్  
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ నుంచి నోటీసులు అందుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ చేరుకున్నారు. పార్లమెంట్ లో మహిళా బిల్లు ఆమోదం కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శుక్రవారం కవిత దీక్ష చేపట్టనున్నారు. ఆమె దీక్షకు దేశ వ్యాప్తంగా భారీ మద్దతు ల‌భిస్తోంది. కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీల ప్రతినిధులు, 29 రాష్ట్రాల నుంచి మహిళా హక్కుల కోసం పోరాడే సంఘాలు, నేతలు దీక్షకు హాజరవుతారని తెలుస్తోంది. 

ఇక ఈ దీక్షలో విపక్షాలు జంతర్ మంతర్ వేదికగా బల ప్రదర్శనకు దిగనున్నాయి. దీక్షకు హాజరై సంఘీభావం తెలపనున్న పార్టీల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, టీఎంసీ, ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన, ఎన్సీపీ, పీడీపీ, అకాలీదళ్, జేడీయూ, ఆర్జేడీ, సమాజ్ వాదీ పార్టీతో పాటు వామ పక్షపార్టీల ప్రతినిధులు కూడా హాజరుకానున్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్‌తో కవిత ఈ కార్యక్రమం చేపట్టారు.  


More Telugu News