రవిశాస్త్రి వ్యాఖ్యలపై మండిపడ్డ రోహిత్ శర్మ

  • మూడో టెస్టులో ఓటమిపై రవిశాస్త్రి కామెంట్ పై రోహిత్ విమర్శ
  • చెత్త వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న రోహిత్
  • డ్రెస్సింగ్ రూమ్ లో ఏం జరుగుతోందో వాళ్లకు ఏం తెలుసని విమర్శ
ఇండియాలో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తొలి రెండు టెస్టుల్లో ఘన విజయం సాధించిన టీమిండియా మూడో టెస్టులో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంతో కామెంటరీ బాక్స్ లో ఉన్న టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలపై కెప్టెన్ రోహిత్ శర్మ మండిపడ్డారు. అతి విశ్వాసమే టీమిండియా ఓటమికి కారణమని శాస్త్రి అన్నారు.

 దీనిపై తాజాగా రోహిత్ శర్మ మాట్లాడుతూ... బయటి వ్యక్తులు చేసే చెత్త వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నాడు. వాస్తవాలు మాట్లాడుకుంటే... తొలి రెండు టెస్టుల్లో తాము గెలిచామని... బయటి వ్యక్తులు చేసిన వ్యాఖ్యలు చెత్తగా ఉన్నాయని విమర్శించాడు. ప్రతి మ్యాచ్ లో ఉత్తమ ప్రదర్శనను ఇచ్చేందుకే తాము కృషి చేస్తామని చెప్పాడు. 

బయట ఉండే వాళ్లకు డ్రెస్సింగ్ రూమ్ లో ఏం జరుగుతోందో ఏం తెలుస్తుందని ఎద్దేవా చేశాడు. బయటి వ్యక్తులు చేసే వ్యాఖ్యలను తాము పట్టించుకోమని అన్నాడు. ప్రత్యర్థికి చిన్న అవకాశం కూడా ఇవ్వకుండా కనికరం లేకుండా ఆడాలని ప్రతి క్రికెటర్ అనుకుంటాడని... తాము కూడా అదే మైండ్ తో ఆడతామని అన్నాడు.


More Telugu News