కిరణ్ అబ్బవరం 9వ సినిమా రేపు లాంచ్ .. హీరోయిన్ ఎవరంటే ..!

కిరణ్ అబ్బవరం 9వ సినిమా రేపు లాంచ్ .. హీరోయిన్ ఎవరంటే ..!
  • కిరణ్ అబ్బవరం 9వ సినిమాకి సన్నాహాలు 
  • రేపు రామానాయుడు స్టూడియోలో లాంచ్ 
  • దర్శకుడిగా వ్యవహరించనున్న విశ్వ కరుణ్ 
  • ఈ సినిమాతో కథానాయికగా నజియా పరిచయం
యంగ్ హీరోలకు గట్టి పోటీనిస్తూ కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే ఆయన నుంచి వచ్చిన 'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమా సక్సెస్ ను సాధించింది. ఆ తరువాత సినిమాగా ఆయన నుంచి 'మీటర్' రానుంది. ఈ నెల 17వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది. ఈ సినిమా విడుదలకు ముస్తాబవుతూ ఉండగానే,  మరో ప్రాజెక్టును ఆయన పట్టాలెక్కిస్తున్నాడు. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటనను కొంతసేపటి క్రితం వదిలారు. శివమ్ బ్యానర్ పై రవి - రాకేశ్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  కెరియర్ పరంగా కిరణ్ అబ్బవరం చేసే 9వ సినిమా ఇది.  

హైదరాబాద్ .. రామానాయుడు స్టూడియోలో ఉదయం 7: 45 నిమిషాలకు ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకోనుంది. గతంలో కొన్ని సినిమాలకి రైటర్ గా పనిచేసిన విశ్వకరుణ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాతో కథనాయికగా నజియా పరిచయమవుతోంది. గతంలో 'మిస్టర్ మజ్ను' .. ' సోలో బ్రతుకే సో బెటర్' అనే సినిమాల్లో గ్లామరస్ గా మెరిసింది.


More Telugu News