ఏఐతో భారీగా దోచేస్తున్న సైబర్ నేరగాళ్లు

  • ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో నకిలీ స్వరం
  • ఫోన్ చేసి కుటుంబ సభ్యులుగా నమ్మించే ప్రయత్నం
  • స్కామర్ల కొత్త ఎత్తుగడలు
  • దేనినీ గుడ్డిగా నమ్మకూడదు
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్/కృత్రిమ మేథ నేడు చాలా కీలక వనరుగా మారుతోంది. ఎన్నో పనులను తేలిక చేస్తోంది. ప్రజల జీవనాన్ని మరింత సులభతరం చేస్తోంది. అయితే, ఎంతో విలువైన ఈ టెక్నాలజీని ఇప్పుడు సైబర్ నేరగాళ్లు కూడా వినియోగించుకుంటున్నారు. దీని ద్వారా దోపిడీలకు పాల్పడుతున్నారు. 

కెనడాకు చెందిన రుత్ కార్డ్ అనే వృద్ధురాలికి ఓ రోజు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వైపు నుంచి ఆమె మనవడు బ్రాండన్ స్వరం వినిపిస్తోంది. తాను జైల్లో ఉన్నానని, తన దగ్గర రూపాయి కూడా లేదని, బెయిల్ కోసం డబ్బు కావాలని అతడు చెప్పాడు. ఎంత డబ్బు కావాలో విన్న తర్వాత రుత్ కార్డ్ (73) తన భర్త గ్రెగ్ గ్రేస్ (75)ను వెంటబెట్టుకుని బ్యాంకుకు వెళ్లింది. పరిమితి మేరకు 3,000 కెనడా డాలర్లను (రూ.2.46 లక్షలు) డ్రా చేసింది. 

అక్కడి నుంచి మరో బ్యాంకు శాఖకు వెళ్లి మరింత మొత్తాన్ని డ్రా చేద్దామనుకున్నారు. ఇప్పుడు అంత మొత్తం ఎందుకన్న ప్రశ్న బ్యాంక్ మేనేజర్ నుంచి వచ్చింది. దానికి వారు మనవడి నుంచి వచ్చిన కాల్ గురించి చెప్పారు. దీంతో అదే విధమైన కాల్ మరో కస్టమర్ కు కూడా వచ్చిందని బ్యాంక్ మేనేజర్ చెప్పారు. తీరా ఆ స్వరం నకిలీదిగా గుర్తించినట్టు చెప్పారు. దీంతో వచ్చిన ఫోన్ కాల్ మీ మనవడి వాయిస్ కాకపోయి ఉంటుందన్నారు. 

కానీ మనవడి కోసం ఆరాటపడిన ఆ వృద్ధ దంపతులు స్కామర్లు కోరినంత బిట్ కాయిన్ల రూపంలో పంపించారు. కానీ, తర్వాత ఆ స్వరం నకిలీదిగా గుర్తించి నోరెళ్లబెట్టారు. కనుక కొత్త టెక్నాలజీతో ఏదీ అసాధ్యం కాదన్నట్టుగా ఉంది. అందుకే దేన్నీ గుడ్డిగా నమ్మకూడదని ఇది తెలియజేస్తోంది.


More Telugu News