అందుకే ఈ వెబ్ సిరీస్ ను కలిసి చూడొద్దనేది: రానా

  • వెబ్ సిరీస్ గా రూపొందిన 'రానా నాయుడు'
  • ప్రధానమైన పాత్రల్లో వెంకటేశ్ - రానా 
  • ఒక కొత్త ట్రెండ్ మొదలుకానున్నట్టు చెప్పిన రానా
  • ఈ నెల 10 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్  
వెంకటేశ్ - రానా ప్రధానమైన పాత్రలుగా 'రానా నాయుడు' వెబ్ సిరీస్ నిర్మితమైంది. నెట్ ఫ్లిక్స్ లో ఈ నెల 10వ తేదీ నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో రానా మాట్లాడుతూ .. "ఇది ఒక డార్క్ ఫ్యామిలీ కథ. ప్రైవేట్ సెటిల్ మెంట్లను కార్పోరేట్ గా చేసే పాత్ర నాది. డైలాగ్స్ పరంగా అక్కడక్కడా కాస్త అభ్యంతరంగా అనిపించినా, కథ అలాంటిది కనుక తప్పలేదు. అందువల్లనే ఫ్యామిలీతో కలిసి చూడొద్దు అని చెప్పింది" అన్నారు. 

"ఇది సినిమాగా చెప్పలేని కథ .. అందువల్లనే వెబ్ సిరీస్ గా చేయవలసి వచ్చింది. వెబ్ సిరీస్ ల వలన ఆర్టిస్టులు ముంబైకి షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువని చెప్పుకుంటున్నారు. కానీ అందులో ఎంతమాత్రం నిజం లేదు.  నిజానికి ముంబైవారే ఇక్కడికి వస్తారు. ఎందుకంటే వెబ్ సిరీస్ లకు సంబంధించి ఇక్కడ ఉన్నన్ని అవకాశాలు ఎక్కడా లేవు" అని చెప్పారు. 

'బహుబాలి' సినిమా సమయంలోనే ఫస్టు టైమ్ హాలీవుడ్ ప్రెస్ మాతో మాట్లాడింది. ఇప్పుడు 'ఆర్ ఆర్ ఆర్' సినిమాలోని 'నాటు పాట' ఆస్కార్ వరకూ వెళ్లింది. ఇప్పుడు ప్రపంచమంతా తెలుగు సినిమా వైపు చూస్తోంది. ఇక వెబ్ సిరీస్ లలోను మరింత ముందుకు వెళ్లడానికి మనం ట్రై చేస్తున్నాం. వెబ్ సిరీస్ లలో ఒక కొత్త ట్రెండ్ మొదలుకాబోతున్నట్టే అని చెప్పాలి" అన్నారు.



More Telugu News